ఎవరిని పంపాలన్న యోచనలో పోలీసులు!

Published: Thursday April 08, 2021

ఛత్తీ‌స్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో.. నక్సలైట్లు బందీగా తీసుకెళ్లిన కోబ్రా కమాండో రాకేశ్వర్‌సింగ్‌ మన్హాస్‌ విడుదలపై ఇంకా సందిగ్ధం వీడలేదు. అతడు క్షేమంగానే ఉన్నాడని, త్వరలో విడుదల చేస్తామని చెప్పిన మావోయిస్టులు.. తాజాగా బుధవారం తమ చెరలో ఉన్న రాకేశ్వర్‌ ఫొటోను మీడియాకు విడుదల చేశారు. à°† ఫొటోలో రాకేశ్వర్‌ ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించారు. అయితే.. మావోయిస్టులు పెట్టిన షరతుపై ఇంకా ఛత్తీ్‌సగఢ్‌ సర్కారు గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ స్పందించలేదు. మావోయిస్టులు మంగళవారం విడుదల చేసిన లేఖలో.. ‘‘మధ్యవర్తుల పేర్లు చెబితే.. రాకేశ్వర్‌ సింగ్‌ను విడుదల చేస్తాం’’ అని స్పష్టంగా పేర్కొన్నారు. మావోయిస్టులు వ్యూహాత్మకంగానే à°ˆ ప్రకటన చేసినట్లు, బంతిని ప్రభుత్వం కోర్టులో వేసినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ తరఫున మంగళవారం à°“ ప్రకటన విడుదలవగా.. అందులో కేవలం తాము కోబ్రా కమాండోను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

 

అతను మావోయిస్టుల చెరలో ఉన్నాడనడానికి ఆధారాలు లేవని పేర్కొన్నారు. à°ˆ నేపథ్యంలోనే మావోయిస్టులు బుధవారం పొటోను విడుదల చేసినట్లు తెలుస్తోంది. కాగా, మధ్యవర్తుల పేర్లను ప్రకటిస్తే జవాన్‌ను వదిలేస్తామన్న మావోయిస్టుల ప్రకటనపై ఛత్తీ్‌సగఢ్‌ పోలీసులు సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులకు పరిచయం ఉన్న రాజకీయ నాయకులు, మావోయిస్టు కొరియర్లు, ఉద్యమంలో లొంగిపోయిన మాజీ మావోయిస్టులు, లేదా పాత్రికేయులు.. వీరిలో ఎవరిని పంపాలనే అనే అంశంపై అధికారులు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై కేంద్రానికి కూడా ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వం à°“ నివేదికను అందించినట్లు సమాచారం. మరోవైపు ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చల మంత్రానికి à°ˆ జవాన్‌ విడుదల ద్వారా బీజం పడుతుందని మావోయిస్టులు ఆశిస్తున్నట్లు కొందరు ఇంటెలిజెన్స్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు.