తిరుపతిలో దొంగ ఓటర్ల కలకలం

Published: Saturday April 17, 2021

తిరుపతి లోక్‎సభ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. వైసీపీ దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి వేల మందిని తరలించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నెల్లూరు, తిరుపతి పరిధిలోని పలు సెగ్మెంట్లలో దొంగ ఓట్లు వేసేందుకు పలువురు ఓటర్లు ప్రయత్నించారని ఇవాళ ఉదయం నుంచే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం విదితమే. ఫేక్ ఓటరు కార్డులతో ఓటేసేందుకు à°•à°¡à°ª నుంచి వచ్చినట్లు సమాచారం. వచ్చిన ఓటర్లకు స్లిప్‎లను వాలంటీర్లు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడున్న విపక్ష నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని టీడీపీ, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్నా యథేచ్చగా వైసీపీ నేతలు తిరుగుతున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. 

 

విషయం తెలుసుకున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ పలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. à°“ పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని రెడ్ హ్యాండెడ్‌à°—à°¾ పట్టుకున్న ఆమె.. పోలీసులకు అప్పగించారు. à°ˆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. తిరుపతి లోకసభ ఎన్నికల్లో వైసీపీ నాయకులు దొంగ ఓట్లను యథేచ్ఛగా వేస్తున్నారని ఆరోపణలు చేశారు. దీనిపై పోలీసులతో పాటు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని రత్నప్రభ వెల్లడించారు. కాగా.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో దొంగ ఓటర్లు ఉన్నారని ఉదయం నుంచీ వార్తలొస్తున్నాయి. వందలాది వాహనాల్లో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లు వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.