పోలవరం ప్రాజెక్టులోని ప్రధాన డ్యామ్ అంచనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

Published: Monday April 19, 2021

 à°ªà±‹à°²à°µà°°à°‚ ప్రాజెక్టులోని ప్రధాన డ్యామ్ అంచనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన డ్యామ్ అంచనాలను రూ. 7,192 కోట్లకు పెంచుతూ ఆదేశాలిచ్చింది. గతంలో ప్రధాన డ్యామ్ నిర్మాణం కోసం 5, 535 కోట్ల రూపాయలుగా జలవనరుల శాఖ నిర్ధారించింది. ప్రధాన డ్యామ్‌లో భాగమైన స్పిల్ వే, ఈసీఆర్ఎఫ్, స్పిల్, పైలట్ ఛానల్ తదితర నిర్మాణాల అంచనాలను మరో రూ. 1600 కోట్ల మేర పెంచుతూ జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

 

కాగా ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు గత ప్రభుత్వంలో 70 శాతం పనులు పూర్తి అయినట్లు చంద్రబాబు అప్పుడు ప్రకటించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిగిలిన పనులు జరుగుతున్నాయి. పనులు నత్తనడకన జరుగుతున్నాయని విపక్షాలు విమర్శలు చేశాయి. అయితే ప్రోలవరం ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అధికార పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులోని ప్రధాన డ్యామ్ అంచనాలు పెంచుతూ జగన్ సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.