భారత్‌కు పాకిస్థాన్ సంఘీభావం

Published: Saturday April 24, 2021

కోవిడ్-19 మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడదామని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. ప్రపంచానికి à°ˆ వైరస్ విసురుతున్న సవాలును ఎదుర్కొనడంలో భారత దేశానికి సంఘీభావం ప్రకటించారు. పొరుగు దేశాలు, ప్రపంచంలో à°ˆ వ్యాధి బారిన పడినవారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. à°ˆ మేరకు ఇమ్రాన్ ఖాన్ శనివారం à°“ ట్వీట్ చేశారు. 

 

ఇమ్రాన్ ఖాన్ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, భారతీయులు ప్రమాదకరమైన కోవిడ్-19 ప్రభంజనంతో యుద్ధం చేస్తున్నారని, వారికి సంఘీభావం ప్రకటిస్తున్నానని పేర్కొన్నారు. పొరుగు దేశాలు, ప్రపంచంలో à°ˆ మహమ్మారి బాధితులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మానవాళి ఎదుర్కొంటున్న à°ˆ అంతర్జాతీయ సవాలుపై మనమంతా కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. 

 

ఇదిలావుండగా, పాకిస్థానీలు శుక్రవారం ట్విటర్ వేదికగా భారత దేశంపై సానుభూతి ప్రకటించారు. భారత దేశానికి à°ˆ కష్టకాలంలో సాయపడాలని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను కోరారు. కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం వల్ల భారతీయులు ఆక్సిజన్ కొరత, ఇతర అత్యవసర సాయం కోసం ఎదురు చూస్తున్నారని, వారికి సాయపడాలని ఖాన్‌ను కోరారు. #ఇండియానీడ్స్ఆక్సిజన్ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. రాజకీయ విభేదాలను పక్కనబెట్టాలని, భారత దేశం à°ˆ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి సాయపడాలని కోరారు.