షెడ్యూల్‌ ప్రకారమే ఇంటర్‌ పరీక్షలు

Published: Thursday April 29, 2021

షెడ్యూల్‌ ప్రకారమే ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. మే 5 నుంచి 19 వరకు ఇంటర్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,452 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి జిల్లాలో 80 నుంచి 90 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక అధికారి ఉంటారని చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రాన్ని శానిటైజ్‌ చేసి సిద్ధం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మెటీరియల్స్‌ ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నాయన్నారు. దేశంలో ఎక్కడా ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయలేదని గుర్తుచేశారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.