ఏపీ సచివాలయంలో కరోనా

Published: Thursday April 29, 2021

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం రేపుతోంది. కరోనాతో మరో ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. సాధారణ పరిపాలన శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నకిషోర్ కుమార్ నిన్న అర్ధరాత్రి మృతి చెందాడు. దీంతో అనేక మంది కరోనా బారిన పడుతుండటంతో భయాందోళనకు గురవుతున్న ఉద్యోగులు తమకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కి అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.