99% మందికిపైగా సేఫ్‌..

Published: Saturday May 01, 2021

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడంలేదని, మరణాలు పెరుగుతున్నాయని వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి! అయితే... కరోనా పాజిటివ్‌ రాగానే మొత్తం à°•à°¥ ముగిసినట్లే అనే భయం ఎంతమాత్రం అవసరంలేదని విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్‌ కాలేజీ పూర్వ ప్రిన్సిపాల్‌, విశాఖపట్నం మానసిక వైద్యశాల రిటైర్డ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భాగ్యారావు చెప్పారు. ఇలాంటి భయాందోళనలు పోగొట్టడానికి సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌ మొదలుపెడుతున్నట్లు తెలిపారు. ‘104’ ద్వారా కరోనా రోగులకు కౌన్సెలింగ్‌ చేయడానికి ప్రభుత్వం క్లినికల్‌ సైకాలజిస్టులను సంప్రదించిందని, రాష్ట్రవ్యాప్తంగా 500 మంది మానసిక వైద్య నిపుణులతో త్వరలో సేవలు అందుతాయని చెప్పారు. ‘కరోనా - మానసిక ఆందోళన’పై డాక్టర్‌ భాగ్యారావు ‘ఆంధ్రజ్యోతి’తో ఏమన్నారంటే... 

కరోనా పాజిటివ్‌ అని తెలియగానే కొంతమంది భయపడిపోతున్నారు. ఇంకో నాలుగైదు రోజులే... à°† తర్వాత ఏమవుతుందో... అని ఆందోళన చెందుతున్నారు. అటువంటి వారు చక్కటి వైద్యం అందిస్తున్నా త్వరగా కోలుకోలేకపోతున్నారు. కరోనా వచ్చినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

 

చాలా ప్రాణాంతక వ్యాధులతో పోల్చితే... కరోనా మరణాల శాతం చాలాచాలా తక్కువ. క్యాన్సర్‌ బాధితుల్లో... 50 శాతం చనిపోతున్నారు. మెనెంజైటిస్‌ వస్తే 10 శాతం చనిపోతున్నారు. తీవ్రమైన రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు 10 నుంచి 20 శాతం చనిపోతున్నారు. కానీ... కరోనా వల్ల చనిపోతున్నది à°’à°• శాతంకంటే తక్కువ. దాదాపు 99 శాతం మంది చికిత్స ద్వారా కోలుకుని సాధారణ జీవనం సాగిస్తున్నారు.

కరోనా మనపై రెండు రకాల ప్రభావం చూపిస్తోంది. à°’à°•à°Ÿà°¿.. శారీరకం. రెండు.. మానసికం. జ్వరం, నీరసం, ఊపిరితిత్తులు దెబ్బతినడం శారీరక సమస్యలు. ఇలా ఎఫెక్ట్‌ అయిన వారు చికిత్సతో కోలుకుంటున్నారు. కరోనా వల్ల కొందరికి మెదడుకు రక్త సరఫరా తగ్గిపోతోంది. దీనిని త్వరగా గుర్తిస్తే చికిత్సతో నయమవుతుంది. మానసిక సమస్య విషయానికి వస్తే... మనుషుల్లో ‘నెర్వ్‌à°¸/యాంగ్జయిటీ ఇండివిడ్యువల్స్‌’ ఉంటారు. వీరు ప్రతి చిన్న విషయానికీ భయపడిపోతారు. ప్రతికూల అంశాలు విన్నా, చూసినా గుండె దడ పెరుగుతుంది. ‘నెగెటివ్‌ యాంగ్జయిటీ’ లెవెల్స్‌ పెరిగిపోతాయి. దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. à°† సమయంలో వారికి వారు ఏదో చేసుకోవాలని యత్నిస్తారు. అటువంటి వారికే కౌన్సెలింగ్‌ అవసరం.