రాష్ట్రంలోని 7 జిల్లాల్లో వెయ్యికిపైగా పాజిటివ్‌లు

Published: Saturday May 01, 2021

రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. à°—à°¤ 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా  86,035 శాంపిల్స్‌ను పరీక్షించగా 14,792 మందికి పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ అయినట్టు, 57 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్టు వైద్య ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 10,84,336à°•à°¿, కొవిడ్‌ మరణాల సంఖ్య 7,928à°•à°¿ పెరిగింది. తాజాగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,831 మంది వైరస్‌ బారినపడ్డారు. ఒకరోజు వ్యవధిలో 8,180 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ కావడంతో రికవరీల సంఖ్య 9,62,250à°•à°¿ పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,14,158 యాక్టివ్‌ కేసులున్నాయి. 

 

ఆంధ్రప్రదేశ్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీ రామ్‌ప్రసాద్‌ కరోనాతో విజయవాడలోని à°“ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆయన రామ్‌ప్రసాద్‌ పది రోజులుగా కరోనాకు చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం కన్నుమూశారు. 

కర్నూలు జిలా మద్దికెర గ్రామానికి చెందిన à°“ వ్యక్తికి వారం క్రితం కరోనా పాజిటివ్‌ రావడంతో కర్నూలు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలిసి.. కుమారుడు గురువారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి కర్నూలుకు వచ్చాడు. ఆస్పత్రిలో ఉన్న తండ్రిని చూసి తట్టుకోలేక పోయాడు. అక్కడే కుప్పకూలి పోయాడు. వెంటనే ఆయనను పరీక్షించిన వైద్యులు మృతి చెందాడని నిర్ధారించారు. 

 

అమరావతి సచివాలయంలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటి కే ఆరుగురు ఉద్యోగులు కొవిడ్‌తో కన్నుమూయగా.. గురువారం మరో ఉద్యోగి ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనాతో మృతిచెందిన సచివాలయ ఉద్యోగుల సంఖ్య ఏడుకు చేరింది. మొదటి బ్లాక్‌లోని సాధారణ పరిపాలనాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ (పొలిటికల్‌) పేషీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పి కిశోర్‌ కుమార్‌ కొద్ది రోజుల క్రితం కరోనాబారిన పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో గురువారం చనిపోయారు. వరుస కరోనా మరణాలతో ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కొందరు ఉద్యోగులు సెలవులు పెట్టారు. కొందరు వర్క్‌ ఫ్రం హోం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఏపీఎ్‌సఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న 50,521 మంది ఉద్యోగులకు వైఎ్‌సఆర్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ కార్డులు జారీచేశామని ట్రస్ట్‌ సీఈవో మల్లిఖార్జున్‌ తెలిపారు. à°ˆ మేరకు ఉద్యోగులందరికీ సమాచారం ఇచ్చామన్నారు. కాగా, రాష్ట్రానికి మరో మూడు లక్షల కొవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులు వచ్చాయి. పుణె సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఎయిరిండియా విమానంలో బుధవారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. వాటిని ప్రత్యేక భద్ర తతో గన్నవరం వ్యాక్సిన్‌ స్టోరేజ్‌ సెంటర్‌కు తరలించారు. గురువారం వాటిని 13 జిల్లాలకు సరఫరా చేశారు.