వెంటిలేటర్‌ బెడ్‌కోసం ఎదురుచూస్తూ.. అంబులెన్స్‌లోనే కన్నుమూసిన విద్యార్థి

Published: Monday May 03, 2021

 à°•à°°à±‹à°¨à°¾ బారినపడిన కుమారుడిని రక్షించుకునేందుకు à°† తండ్రి చేయని ప్రయత్నం లేదు. రెండు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు తిప్పారు. జిల్లా ప్రభుత్వాస్పత్రి వద్దకు తరలించారు. కొందరు నాయకులను పట్టుకొని కూడా ప్రయత్నించారు. ఎక్కడకు వెళ్లినా ఒకటే సమాధానం.. వెంటిలేటర్‌తో కూడిన బెడ్లు లేవు చికిత్స కోసం ఎదురు చూస్తూ ప్రభుత్వాస్పత్రి ఆవరణలో అంబులెన్సులోనే తన కుమారుడు కొడిగట్టిపోవడం చూపి à°† తండ్రి కన్నీటిపర్యంతమయ్యాడు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాస్పత్రి ఆవరణలో à°ˆ విషాదం చోటుచేసుకొంది.

 

వివరాల్లోకి వెళితే... పెంటపాడు మండలం కె.పెంటపాడులోని మండల పరిషత్‌ పాఠశాల (నం.1)లో టీచర్‌à°—à°¾ పనిచేస్తున్న సింగులూరి వేణుగోపాలరావుకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు మణికంఠ(14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వారం క్రితం దగ్గు, జ్వరం రావడంతో తాడేపల్లి గూడెంలోని ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేయించారు.

 

à°ˆ పరీక్షల్లో కొవిడ్‌ నెగిటివ్‌ వచ్చింది. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తణుకులోని à°“ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. సిటీ స్కాన్‌ లో పాజిటివ్‌ లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. అక్కడి నుంచి మళ్లీ తాడేపల్లిగూడెం ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చి చేర్పించారు. మణికంఠకు శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బంది ఏర్పడటంతో.. మెరుగైన వైద్యంకోసం ఆదివారం ఉదయం హుటాహుటిన అంబులెన్సులో మణికంఠను తీసుకుని తండ్రి వేణుగోపాలరావు ఏలూరు వచ్చారు. అక్కడ రెండు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో సంప్రదించినా..వెంటిలేటర్‌ ఉన్న బెడ్లు దొరకలేదు. చివరిగా ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి ఆవరణలో అంబులెన్స్‌లో మణికంఠకు ఆక్సిజన్‌ అందిస్తూ.. తండ్రి తన ప్రయత్నాలు కొనసాగించారు. అప్పటికే మణికంఠ ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోతున్నాయి.

 

అడ్మిషన్‌ కోసం ప్రభుత్వాస్పత్రి అధికారులతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సూర్యారావు స్వయంగా మాట్లాడారు. మధ్యాహ్నం తర్వాత కొన్ని బెడ్లు ఖాళీ అవుతాయని, అప్పటివరకు తామేం చెప్పలేమని సమాధానం వచ్చింది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రిలోనైనా జాయిన్‌ చేయించి రక్షించుకుందామని వేణుగోపాలరావు ప్రయత్నాలు చేశారు. ఇంతలోనే అంబులెన్సులో వైద్యం కోసం ఎదురుచూస్తున్న మణికంఠ మధ్యాహ్న సమయంలో తుది శ్వాస విడిచాడు. కాగా, మణికంఠ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని యూటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.