18 రాష్ట్రాల్లో కేసుల తగ్గుదల.. జాబితాలో మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ, ఛత్తీ్‌సగఢ్

దేశంలో కరోనా కొత్త కేసులు, మరణాల తగ్గుదల ప్రారంభమైందని.. మహమ్మారి సెకండ్ వేవ్ క్షీణతకు ఇది సూచిక అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల వరకు రెండో దశ ఉధృతి తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీ్‌సగఢ్‌తో పాటు మరో 14 రాష్ట్రాల్లో ప్రస్తుతం వైరస్ నెమ్మదించిందని తెలిపింది. అయితే, దక్షిణాదిలోని కర్ణాటక, తమిళనాడు, కేరళలో కేసుల పెరుగుదల కొనసాగుతోందని వివరించింది. వీటితోపాటు పశ్చిమ బెంగాల్, పంజాబ్ సహా 16 రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది. 13 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు లక్షపైగా ఉన్నాయని చెప్పింది. 26 రాష్ట్రాల్లో పాజిటివ్ రేటు 15పైగా ఉందని తెలిపింది. మరోవైపు దేశంలో సోమవారం 3,29,942 కేసులు నమోదయ్యాయి. గత 14 రోజుల్లో ఇవే తక్కువ. కొత్తగా 3.56 లక్షల మంది కోలుకున్నారు. రెండు నెలల తర్వాత కేసుల కంటే రికవరీలు ఎక్కువగా నమోదయ్యాయి. మంగళవారం నాటికి 37.15 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. గత 61 రోజుల్లో ఎన్నడూ లేనివిధంగా ఒక్క రోజే యాక్టివ్ కేసులు 30 వేలపైగా తగ్గాయి. కాగా, కరోనాతో దేశంలో మంగళవారం 3,876 మంది చనిపోయారు. మొత్తమ్మీద పాజిటివ్ రేటు 21గా ఉందని కేంద్రం వివరించింది మూడు రోజుల్లో రాష్ట్రాలకు 7 లక్షల టీకాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రాల వద్ద ఇప్పటికి 90 లక్షలపైగా టీకాలు ఉన్నట్లు పేర్కొంది.
కరోనా ప్రారంభం నుంచి దేశంలో రోజువారీ అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రం మహారాష్ట్ర. మధ్యలో అతి కొద్ది రోజులు కేరళలో ఎక్కువ పాజిటివ్‌లు వచ్చాయి. ఫిబ్రవరి మధ్య నుంచి ప్రారంభమైన సెకండ్ వేవ్‌లో మాత్రం మొదటినుంచి మహారాష్ట్రలోనే గరిష్ఠ సంఖ్యలో కేసులు వచ్చాయి. తాజాగా కర్ణాటక పాజిటివ్‌లతో పాటు మరణాల్లోనూ దానిని అధిగమించింది. సోమవారం కర్ణాటకలో 39,305 మందికి వైరస్ నిర్ధారణ కాగా, 596 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 37,236 కేసులు రాగా, 549 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో మరో 12,481 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 13,583 మంది కోలుకున్నారు. 347 మరణాలు నమోదయ్యాయి. పాజిటివ్ రేటు 17.76కు తగ్గింది. దేశ రాజధానిలో లాక్‌డౌన్ మూడు వారాలుగా లాక్‌డౌన్ అమలుతో కరోనా వ్యాప్తి తగ్గినట్లు స్పష్టమవుతోంది. మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ను నెలాఖరు వరకు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 15తో ముగియాల్సి ఉన్నప్పటికీ.. సగానికి పైగా జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగానే ఉంది. దీంతో ప్రభుత్వం పొడిగింపు ఆలోచన చేస్తోంది. ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో శుక్రవారం నుంచి ఏడు రోజులు లాక్‌డౌన్ అమలు కానుంది.
ఆక్సిజన్ కొరత, సరఫరా లోపాలతో ఆస్పత్రుల్లో రోగులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గోవాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో దారు ణం జరిగింది. రాజధాని పనాజీలోని గోవా వైద్య కళాశాల ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు 26 మంది కరోనా రోగులు చనిపోయారు. ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం, కొవిడ్ వార్డులకు సరఫరాలో లోపం వల్ల ఈ ఉదంతం జరిగి ఉండొచ్చని సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. ఆస్పత్రిని సందర్శించిన ఆయన వైద్య కళాశాలలో ఆక్సిజన్‌కు మాత్రం కొరత లేదని చెప్పారు. కాగా, వైద్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణె మాత్రం సోమవారం నాటికి ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఉందని తెలిపారు.

Share this on your social network: