ఒక్క రోజులో అత్యధికంగా 4,329 మంది మృతి

Published: Wednesday May 19, 2021

 à°¦à±‡à°¶à°‚లో à°“ వైపు కరోనా కేసులు గణనీయంగా తగ్గుతుంటే.. మరణాలు మాత్రం భారీగా ఉంటున్నాయి. సోమవారం అత్యధికంగా 4,329 మంది చనిపోయారు. మృతుల సంఖ్య నాలుగు వేలు ఆపైన ఉండటం వారంలో ఐదోసారి కావడం గమనార్హం. à°—à°¤ బుధవారం 4,205 మంది మృతిచెందగా.. ఇప్పుడు అంతకుమించిన సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కొత్తగా 2,63,533 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఏప్రిల్‌ 20 తర్వాత ఇవే అత్యల్పం. కాగా, మే 6à°¨ నమోదైన 4.14 లక్షల అత్యధిక కేసులకు ఇవి దాదాపు 30ు తక్కువ. వరుసగా రెండో రోజు కేసులు 3 లక్షల లోపే ఉన్నాయి. ఆరో రోజూ పాజిటివ్‌లు తగ్గా యి. పది రోజుల్లోనే భారీ తగ్గుదల నమోదైంది. తాజా à°—à°¾ రికార్డు స్థాయిలో 4,22,436 మంది కోలుకున్నారు. లక్షపైన యాక్టివ్‌ కేసులున్న రాష్ట్రాల సంఖ్య à°—à°¤ వారం వరకు 12 ఉండగా.. ఇప్పుడు 8à°•à°¿ తగ్గింది. సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న మహారాష్ట్రలో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా 26 వేల కేసులే వచ్చా యి. కేరళ (21,400)లోనూ పాజిటివ్‌లు భారీగా తగ్గా యి. ఉత్తరప్రదేశ్‌(9,391)లో పదివేల దిగువకు చేరాయి. ఢిల్లీలో మూడో రోజూ 5 వేల లోపునే నమోదయ్యాయి.

 

అయితే, కర్ణాటక(38,603), తమిళనాడు (33,075)లో ఉధృతి కొనసాగుతోంది. వీటితోపాటు పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, ఒడిసాల్లో 10 వేల నుంచి 20 వేల మధ్య కేసులు వచ్చాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2.52 కోట్లు దాటింది. ప్రపంచంలో అమెరికా తర్వాత à°ˆ స్థాయిలో పాజిటివ్‌లు నమోదైంది భారత్‌లోనే. హీరోయిన్‌ కంగనా రనౌత్‌ (34) కరోనా నుంచి కోలుకున్నారు. మంగళవారం నిర్వహించిన పరీక్షలో నెగెటివ్‌ వచ్చినట్లు తె లిపారు. కంగనా à°ˆ నెల 8à°¨ వైరస్‌ బారినపడ్డారు. తాజా మరణాల్లో మహారాష్ట్రలోనే వెయ్యి నమోదయ్యాయి. కర్ణాటక (476), ఢిల్లీ (340), తమిళనాడు (335)ల్లో భారీ సంఖ్యలో రోగులు చనిపోయారు. ఓవైపు కేసులు తగ్గుతుండగా మృతుల సంఖ్య భారీగా ఉంటోంది. ఇలా ఎందుకనే దానిపై సందేహాలు వస్తున్నాయి. కాగా, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) మాజీ అధ్యక్షుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ కేకే అగర్వాల్‌(62) కరోనాతో మృతి చెందారు. కేకే అగర్వాల్‌ ప్రముఖ కార్డియాలజిస్ట్‌. వైర్‌సపై కీలకమైన సమాచారంతో కూడిన వీడియోల అప్‌లోడ్‌తో ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందారు. కరోనా బారినపడిన ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. 

 

దేశ జనాభాలో ఇప్పటివరకు వైరస్‌ బారిన పడినవారి శాతం 1.8 మాత్రమేనని.. ఇంకా 98 శాతంపైగా ప్రజలకు కరోనా ముప్పు పొంచే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే, కొవిడ్‌ 2 శాతం మందికి వ్యాపించే లోగానే కట్టడి చేయగలమని తెలిపింది. శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 199 జిల్లాల్లో మూడు వారాలుగా కేసులు తగ్గుతున్నట్లు వివరించారు. 22 రాష్ట్రాల్లో పాజిటివ్‌ రేటు 15à°—à°¾ ఉండటం ఆందోళనకరమేనని లవ్‌ అగర్వాల్‌ అన్నారు. తమిళనాడులో అత్యధికంగా 24à°—à°¾ ఉందన్నారు. మంగళవారం దేశంలో పాజిటివ్‌ రేటు 14.10à°—à°¾ ఉందన్నారు. à°ˆ నెల 3à°¨ రికవరీ రేటు 81.7 కాగా.. తాజాగా 85.6కు చేరిందన్నారు. 

రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అభివృద్ధిచేసిన కరోనా ఔషధం ‘2-డీజీ’ని కొవిడ్‌ చికిత్సకు సంబంధించిన ప్రొటొకాల్‌లో చేర్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని నీతి ఆయోగ్‌ సభ్యుడు(ఆరోగ్య విభాగం) డాక్టర్‌ వి.కె.పాల్‌ వెల్లడించారు. త్వరలో జరగనున్న కొ విడ్‌-19 జాతీయ టాస్క్‌ఫోర్స్‌ భేటీలో దీనిపై à°“ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.