రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న బ్లాక్‌ ఫంగస్‌

Published: Wednesday May 19, 2021

ఓవైపు కరోనా వైరస్‌.. మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ ముప్పేట దాడి కరోనా బాధితులకు à°•à°‚à°Ÿà°¿ మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హమ్మయ్య కొవిడ్‌ మహమ్మారి నుంచి కోలుకున్నాంలే అని ఊపిరి పీల్చుకునే లోపు.. బ్లాక్‌ ఫంగస్‌ పంజా విసురుతోంది. దాన్ని గుర్తించడంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా.. గుర్తించిన తర్వాత అలసత్వం ప్రదర్శించినా ప్రాణానికే ముప్పుగా మారుతోంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి, కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్‌ ఎక్కువగా వాడిన వారికి బ్లాక్‌ ఫంగస్‌ పెను సవాల్‌ విసురుతోంది.  

 

రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. కేసుల సంఖ్య పదుల సంఖ్య నుంచి వందలకు చేరుకుంటోంది. కరోనాకు చికిత్స సందర్భంగా వాడిన మందుల ప్రభావం వల్లే ఎక్కువ మందిలో ఫంగస్‌ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ అనేది కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. ఇసుక, మట్టి, నీళ్లలో కూడా ఇది ఉంటుంది. ఏదో à°’à°• విధంగా ప్రతి ఒక్కరి శరీరంలోకి ప్రవేశిస్తుంది. కానీ శరీరంలో రోగనిరోధక శక్తి వల్ల దాని ప్రభావం పెద్దగా ఉండదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా బాధితుల్లోనే బ్లాక్‌ ఫంగస్‌ సమస్య వస్తోంది. కరోనా సాధారణ లక్షణాలుండి పారాసిటమాల్‌, ఆజిథ్రాల్‌, ఐవర్‌మెట్టిన్‌ వంటి మందులకు తగ్గిపోతే బ్లాక్‌ ఫంగస్‌ సమస్యలు రావు. కరోనా వైరస్‌ వలన ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్న వారికి వైద్యులు ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్‌ వాడుతున్నారు. ఇది శరీరంలోని చెడు వైర్‌సతోపాటు మంచి బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది. దీంతో రోగనిరోధకశక్తి క్షీణిస్తుంది. 

 

à°ˆ సమయంలో బ్లాక్‌ ఫంగస్‌ దాడిచేస్తుంది. ప్రస్తుతం కొవిడ్‌ బారినపడుతున్న వారిలో 80 శాతం మందికి వైద్యులు స్టెరాయిడ్స్‌ వాడుతున్నారు. మధుమేహ రోగులు సాధారణంగానే బలహీనంగా ఉంటారు. à°ˆ సమయంలో స్టెరాయిడ్స్‌ ఇవ్వడం వల్ల అవయవాలు మరింత బలహీనంగా తయారవుతాయి. దీంతో ఫంగ్‌సలు, బ్యాక్టీరియాలు ఎక్కువ ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ బారినపడుతున్న వారిలో 99 శాతం మంది మధుమేహ సమస్యలున్నవారే. కాబట్టి కొవిడ్‌ నుంచి బయటపడిన డయాబెటిక్‌ రోగులు వైద్యుల సలహాలతో ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు కొవిడ్‌కు చికిత్స సమయంలో ఆక్సిజన్‌ వరకూ వెళ్లే రోగులకు పెట్టే ఇముడిఫైయర్స్‌ (ఆక్సిజన్‌ సప్లయ్‌ చేసే పరికరం)లో డిస్టల్‌ వాటర్‌ లేదా ఆర్వో వాటర్‌ను ఉపయోగించాలి. అవి ఏ రోజుకారోజు మార్చుకోవాలి. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పొందుతున్న బాధితుల ఇముడిపైయర్స్‌లో నీటిని ప్రతిరోజు మార్చడం లేదు. దీని వల్ల కూడా బ్లాక్‌ఫంగస్‌ వ్యాప్తి ఎక్కువవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

 

బ్లాక్‌ ఫంగస్‌ నాలుగు దశల్లో ప్రభావం చూపుతుంది. తొలుత ముక్కు ఎరుపు రంగులోకి మారి, à°† తర్వాత ముక్కులోపల నల్లగా తయారవుతుంది. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారికి చుట్టుపక్కల ఏమీ లేకపోయినా దుర్వాసన వస్తుంది. ముక్కు నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. à°ˆ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లను స్పందించి నాసిల్‌ ఎండోస్కోపి చేయించుకోవాలి. అప్పటికీ నిర్లక్ష్యం చేస్తే సైనస్‌ వరకూ వ్యాప్తి చెంది, అక్కడ నుంచి కళ్లపై ప్రభావం చూపుతుంది. దీంతో కళ్లు ఎర్రగా మారి వాపు వస్తుంది. అక్కడ నుంచి నేరుగా బ్రెయిన్‌పై దాడి చేస్తుంది. బ్లాక్‌ ఫంగస్‌ మెదడులోకి చేరిందంటే తీవ్ర ప్రమాదంలోకి జారుకున్నట్లే. మెదడుపై ప్రభావం పడితే బ్రెయిన్‌ సర్జరీల వరకూ వెళ్లాల్సి వస్తుందని వైద్యలు చెబుతున్నారు. కాబట్టి మొదటి లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించడం మేలని అంటున్నారు.

 

కొవిడ్‌ సృష్టించిన భయం కారణంగా ప్రస్తుతం సాధారణ జ్వరం వచ్చినా యాంటీవైరల్‌ డ్రగ్స్‌ అధికంగా వాడుతున్నారు. ఇది కూడా శరీరానికి ప్రమాదకరంగా మారుతోంది. దీని వల్ల కూడా శరీరంలో రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. à°† సమయంలో బ్లాక్‌ ఫంగస్‌, ఇతర ప్రమాదకరమైన బ్యాక్టీరియా హాని చేకూరుస్తాయి. కాబట్టి ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు యాంటీవైరస్‌ డ్రగ్స్‌ ఉపయోగాన్ని నియంత్రించాలి. దీనికి వైద్యులు కూడా సహకరించాలి.