ఆనందయ్య ఆయుర్వేద ఔషధంపై ఏపీ ఆయుష్ కమిషన్ పరిశీలన

Published: Sunday May 23, 2021

ఆనందయ్య ఆయుర్వేద ఔషధంపై ఏపీ ఆయుష్ కమిషన్ పరిశీలన ముగిసింది. ఆయూష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య మందును తయారు చేశారు. ఆనందయ్య ఎలాంటి హానికర పదాదార్థాలను వాడటం లేదని ఏపీ ఆయూష్ కమిషనర్ రాములు వెల్లడించారు. మందు తయారీలో హానికర పదార్థాలు లేవని రాములు వెల్లడించారు. ఆనందయ్య మందును నాటుమందుగానే పరిగణిస్తామని రాములు వెల్లడించారు. కళ్లలో వేసే డ్రాప్స్‌లో కూడా సాధారణ పదార్థాలే వాడుతున్నారని స్పష్టం చేశారు. అయితే ఆనందయ్య మందు రోగులపై పనిచేస్తుందా లేదా అనేది ఆయుర్వేద డాక్టర్ల బృందం తేల్చుతుందని రాములు వెల్లడించారు. డాక్టర్ల బృందం పరిశీలన అనంతరం తమ నివేదికను సీసీఆర్ఎఎస్‌‌కు పంపుతుందున్నారు. అన్ని నివేదికలు వచ్చిన తర్వాత మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం వస్తుందని రాములు వెల్లడించారు.