‘త్రాంబోసిస్‌’ లక్షణాలతో మొదలవుతున్న ముప్పు

Published: Monday May 24, 2021

కరోనా నుంచి కోలుకున్న వారికి ‘గ్యాంగ్రిన్‌’ రూపంలో మరో à°—à°‚à°¡à°‚ ఎదురవుతోంది. ‘బ్లాక్‌ ఫంగస్‌’ సోకితే.. à°•à°‚à°Ÿà°¿ చూపును కోల్పోయే ముప్పుతో పాటు మొత్తం దవడనే తీసేయాల్సి రావచ్చు. ‘గ్యాంగ్రిన్‌’ చుట్టుముడితే.. అది వ్యాపించిన కాళ్లు, చేతులను తొలగించాల్సి వస్తుంది. à°ˆ సమస్యతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య మార్చి నుంచే క్రమంగా పెరుగుతోందని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన వాస్క్యులర్‌ సర్జన్‌ డాక్టర్‌ మనీశ్‌ రావల్‌ à°“ ఆంగ్ల టీవీ చానల్‌కు తెలిపారు. గ్యాంగ్రిన్‌ బాధితుల్లో ఎక్కువ మంది కొవిడ్‌ నుంచి కోలుకున్న వారేనన్నారు. à°ˆ ఆరోగ్య సమస్యకు ప్రధాన కారణం ‘త్రాంబోసిస్‌’ అని ఆయన తెలిపారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న కొందరిలో రోగ నిరోధక వ్యవస్థ పనితీరు క్షీణించి త్రాంబోసి్‌సకు దారితీస్తోందన్నారు. ఫలితంగా బాధితుల రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతోందని పేర్కొన్నారు. ధమనులు గుండె నుంచి వివిధ శరీర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్తాయి.

 

‘‘ఉదాహరణకు కాలిలోని à°’à°• ధమని త్రాంబోసి్‌సతో ప్రభావితమైతే.. మొత్తం కాలు బరువుగా, మొద్దుబారినట్లు అనిపిస్తుంది. à°† తర్వాత కాలు పూర్తిగా చల్లబడిపోతుంది. కాలు తొలుత నీలిరంగుకు, తర్వాత ఎరుపు రంగులోకి మారిపోతుంది. à°ˆ స్థితినే గ్యాంగ్రిన్‌ అంటారు. దీని లక్షణాలను గుర్తించిన à°—à°‚à°Ÿ నుంచి ఆరు గంటల్లోగా చికిత్స చేయించుకోవాలి. లేదంటే à°† కాలును తీసేయాల్సి రావచ్చు’’ అని à°“ డాక్టర్‌ వివరించారు.  శరీరంలోని ఏ భాగాన్నైనా గ్యాంగ్రిన్‌ ప్రభావితం చేయగలదని హెచ్చరించారు. త్రాంబోసి్‌సకు సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా ముప్పు నుంచి బయటపడొచ్చని సూచించారు.