సెంచరీ కొట్టిన పెట్రోల్‌

Published: Monday May 24, 2021

 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లోనూ పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టింది. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ర్టాల్లో లీటరు పెట్రోల్‌ ధర వంద రూపాయలు దాటగా, ఆదివారం మన రాష్ట్రం కూడా à°† జాబితాలో చేరింది. à°—à°¤ కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు 5 రాష్ర్టాల ఎన్నికలతో కొంత బ్రేక్‌ పడినా, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతి రోజు నుంచే మళ్లీ పెంపు మొదలైంది. తాజాగా ఆదివారం పెట్రోలుపై లీటరుకు 17 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెరిగింది. దీంతో చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో ఆదివారం లీటరు పెట్రోల్‌ ధర రూ.100.30కు చేరింది. అదే జిల్లాలోని చిత్తూరు, ఐరాల, కుప్పం ప్రాంతాల్లోనూ లీటరు ధర వంద దాటేసింది. ఇక మిగిలిన జిల్లాల్లో వందకు అర్ధరూపాయి నుంచి రూపాయిలోపే తక్కువ ఉంది. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ లీటరు ధర వంద రూపాయలు దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక తాజా పెంపుతో విజయవాడలో లీటరు పెట్రోలు ధర రూ.99.41, అనంతపురంలో రూ.99.25, ఏలూరులో రూ.99.64, గుంటూరులో రూ.99.39, కడపలో రూ.98.43, కాకినాడలో రూ.99.57, కర్నూలులో రూ.99.71, మచిలీపట్నంలో రూ.99.63, నెల్లూరులో రూ.99.71, ఒంగోలు రూ.98.51, శ్రీకాకుళం రూ.99.15, విశాఖపట్నం రూ.98.19, విజయనగరంలో రూ.98.71కు చేరింది. అలాగే, రాష్ట్రంలో డీజిల్‌ ధర లీటరు రూ.94కు చేరింది. ఈనెల 1à°¨ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.5, డీజిల్‌ రూ.90 ఉండగా, à°ˆ ఒక్క నెలలోనే లీటరుపై దాదాపు రూ.3 పెరిగింది. అలాగే, గతేడాది మే నెలలో లీటరు పెట్రోల్‌ రూ.74.50, డీజిల్‌ రూ.68.43 ఉండగా, ఏడాదిలోనే రూ.25 పెరగడం గమనార్హం. గతంతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు పెంపు. ఎందుకంటే పక్షానికోసారి పెట్రోలు ధరలు సవరణ ఉన్న సమయంలో ప్రతిసారీ సగటున 50 పైసలే ధరల్లో మార్పు ఉండేది. ఎలా చూసినా సంవత్సరానికి సగటున రూ.10à°•à°¿ మించి పెరిగేది కాదు. కానీ, ఇప్పుడు ఏకంగా రూ.25 పెరిగింది.

పెట్రో ధరల పెంపునకు కేంద్ర, రాష్ట్ర భారీ పన్నులే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఎలా ఉన్నా, ఇక్కడ మాత్రం పెట్రో ధరలు పైపైకే వెళ్తున్నాయి. చమురు కంపెనీలు ధరలు పెంచుకుంటూ పోతుంటే, అందుకు అనుగుణంగా రాష్ట్రంలో పన్నులు పెరుగుతున్నాయి. దీనికి అదనంగా ఏపీలో ప్రత్యేక పన్నులు వేయడంతో ఎక్కడాలేని స్థాయికి రాష్ట్రంలో ధరలు చేరుతున్నాయి.  

పెట్రోల్‌ లీటరు ధర రూ.99.40 ఉంటే అందులో వాస్తవ ముడిచమురు ధర రూ.35.92, ఎక్సైజ్‌ డ్యూటీ రూ.32.98 ఉన్నాయి. అలాగే, రాష్ట్రం విధిస్తున్న వ్యాట్‌ రూ.21.40, అదనపు వ్యాట్‌ రూ.4, రోడ్‌ సెస్‌ రూ.1.31, డీలరు మార్జిన్‌ రూ.3.08, రవాణా చార్జీ రూ.0.3 కలిపి మొత్తం రూ.26.7 అవుతోంది. అంటే మొత్తం ధరలో మూడింట రెండొంతులు పన్నులే ఉన్నాయి.

 

డీజిల్‌ లీటరు ధర రూ.93.58 ఉంటే, అందులో వాస్తవ ముడిచమురు ధర రూ.38.14, ఎక్సైజ్‌ డ్యూటీ రూ.31.38 ఉన్నాయి. ఇక రాష్ట్రం విధిస్తున్న వ్యాట్‌ రూ.15.6, అదనపు వ్యాట్‌ రూ.4, డీలరు మార్జిన్‌ రూ.2.3, రోడ్‌ సెస్‌ రూ.1.22, రవాణా చార్జీ రూ.0.3 కలిపితే మొత్తం రూ.20.8 అవుతోంది.

పెరుగుతున్న పెట్రో ధరలకు అనుగుణంగా తమ పెట్టుబడి భారీగా పెరిగిపోయిందని రాష్ట్ర పెట్రో డీలర్ల సంఘం అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. సగటున ఒక్కో బంకు యాజమాన్యంపై నెలకు రూ.20 లక్షల పెట్టుబడి పెరిగిందన్నారు. మరోవైపు విద్యుత్‌ చార్జీలు, సిబ్బందికి జీతాలు అన్నీ పెరిగాయని, అయినా 2017 నుంచి తమకు ఒక్క పైసా మార్జిన్‌ పెంచలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ఎన్నిసార్లు చమురు కంపెనీలకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. కొత్త పెట్రోల్‌ బంకులకు అనుమతి, ధరల పెరుగుదలతో అమ్మకాలు భారీగా పడిపోయాయని, ఇది డీలర్లకు తీవ్ర నష్టం కలిగిస్తోందని తెలిపారు.