జగన్‌ బెయిలుపై సీబీఐ ఏమంటుంది?

Published: Saturday May 29, 2021

అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్‌ బెయిలును రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది? ‘ఔను... రద్దు చేయాలి!’ అంటుందా? లేక... ‘రద్దు చేయవద్దు.  బెయిలు నిబంధనలను ఆయన ఎంతమాత్రమూ ఉల్లంఘించడంలేదు’ అని చెబుతుందా? ఇది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. జగన్‌ బెయిలు రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జగన్‌తోపాటు సీబీఐ కూడా కౌంటర్‌ దాఖలు చేయాల్సి ఉంది. కానీ... లాక్‌డౌన్‌ పేరుతో జగన్‌ న్యాయవాది, ఉన్నతాధికారుల అభిప్రాయం తెలుసుకోవాలంటూ సీబీఐ లాయర్‌ కౌంటర్‌ వేయకుండా వాయిదా కోరారు. దీనిపై సీబీఐ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ... జూన్‌ 1లోపు కౌంటర్‌ వేయకుంటే, తామే పిటిషన్‌పై నేరుగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. అంటే... ఇక మూడు రోజులే గడువు! జగన్‌ కౌంటర్‌ విషయంలో ఎలాంటి గందరగోళమూ లేదు. ఎందుకంటే... బెయిలు రద్దు చేయవద్దనే ఆయన కోరుతారు. ఇక... సీబీఐ ఏం చెబుతుందన్నదే ప్రశ్న! కేంద్రం మనసులో మాట?: అధికారంలోకి రాకముందు నుంచే బీజేపీతో జగన్‌ సత్సంబంధాలు నెరుపుతున్న విషయం బహిరంగ రహస్యమే. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన అదే వైఖరి కొనసాగిస్తున్నారు. ప్రత్యేక హోదా మొదలుకుని, కొవిడ్‌ సమయంలో రాష్ట్రానికి ఆక్సిజన్‌/వ్యాక్సిన్‌ కేటాయింపు వరకు... ‘విన్నపాల’కు మాత్రమే పరిమితమవుతున్నారు. ప్రధానమంత్రిని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి విమర్శించినా జగన్‌ ఊరుకోకపోవడం గమనార్హం. ‘రాజకీయ ప్రాధాన్యమున్న’ కేసుల్లో సీబీఐ సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. à°ˆ నేపథ్యంలో... జగన్‌ బెయిలు రద్దు పిటిషన్‌పై కేంద్రం ‘సూచనల’ ప్రకారమే నడుచుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దర్యాప్తు సంస్థలు నిందితుడికి వ్యతిరేకంగా వ్యవహరించడం సహజం. బెయిలు పిటిషన్లను వ్యతిరేకించడం, గరిష్ఠ శిక్ష విధించాలని కోరడం... ఇందులో భాగమే. à°ˆ విధంగా చూస్తే... జగన్‌ బెయిలును రద్దు చేయాలని సీబీఐ కోరాలి. అదే జరిగితే... పెద్ద సంచలనం అవుతుంది. జగన్‌పట్ల కేంద్రం వైఖరికి అదొక సంకేతంగా భావించవచ్చు. ఇక... సీబీఐ ముందున్న మరో ‘ఆప్షన్‌’, బెయిలు రద్దు చేయాల్సిన అవసరం లేదని చెప్పడం! ఇది à°’à°• దర్యాప్తు సంస్థగా సీబీఐ చేయకూడని పని. ఎందుకంటే... రఘురామరాజు తన పిటిషన్‌లో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. అక్రమాస్తుల కేసులో సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరిస్తున్నారని.. బెయిల్‌ షరతులను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. పలువురు సాక్షులు జగన్‌ ప్రభుత్వంలో అధికారులుగా ఉండటం, కొందరు సహ నిందితులు కీలక స్థానాల్లో ఉండటం, à°’à°•à°°à°¿à°•à°¿ సలహాదారు పదవి ఇవ్వడం, విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు పంపడం లాంటివన్నీ పిటిషన్‌లో వివరించారు. ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను జీర్ణించుకోలేని వైసీపీ నేతలు న్యాయవ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఇంత నిర్దిష్టమైన అంశాలు పేర్కొన్నప్పటికీ... జగన్‌ బెయిలు రద్దు చేయకూడదనే వైఖరికే సీబీఐ కట్టుబడితే అది కేంద్రం ‘సూచనల’ మేరకే జరిగినట్లు భావించాల్సి ఉంటుంది. ఇది... కేంద్రంతో జగన్‌ సత్సంబంధాల ఫలితమే అని చెప్పవచ్చు. 

జగన్‌ బెయిలు రద్దుకు ఎస్‌ లేదా నో చెప్పడంతోపాటు సీబీఐ ముందు మరొక ఆప్షన్‌ కూడా ఉంది. అదేమిటంటే... ‘à°ˆ విషయంలో మేం జోక్యం చేసుకోం. మీరే నిర్ణయం తీసుకోండి’ అని బంతిని సీబీఐ కోర్టులోకే నెట్టేయడం! అలాగే... అసలు కౌంటరే వేయకుండా మౌనం పాటించవచ్చు. ‘జూన్‌ 1à°µ తేదీ నాటికి కౌంటర్‌ వేయకపోతే నేరుగా పిటిషన్‌పై విచారణ చేపడతాం’ అని కోర్టు ఇప్పటికే చెప్పింది. à°† తర్వాత... విచారణ సమయంలో సీబీఐ  అభిప్రాయాన్ని కోరే అవకాశముంటుంది. అది ప్రస్తుతానికి... అప్రస్తుతం! మొత్తానికి... జగన్‌ విషయంలో కేంద్రం మెతక వైఖరితో ఉందా, వ్యతిరేకత భావనతో ఉందా అనే విషయం మరో మూడు రోజుల్లో తేలిపోతుంది.

కొసమెరుపు: à°¤à°¿à°°à±à°ªà°¤à°¿ పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌చార్జి సునీల్‌ దియోధర్‌ బహిరంగంగా మాట్లాడుతూ... త్వరలో జగన్‌ బెయిల్‌ రద్దవుతుందని వ్యాఖ్యానించారు. దీని భావమేమిటో మరి!