ఖాతాల్లో జమ కాని పంటల బీమా పరిహారం

Published: Monday May 31, 2021

సాక్షాత్తు ముఖ్యమంత్రే కంప్యూటర్‌లో బటన్‌ నొక్కా రు. 15.15లక్షల మంది రైతుల ఖాతాల్లో పంటల బీమా పరిహారం సొమ్ము రూ.1,820కోట్లు జమ చేశామని ఘనం à°—à°¾ ప్రకటించారు. కొన్ని నిమిషాల్లోనే ఖాతాల్లో పడాల్సిన డబ్బులు రెండు రోజులు గడిచినా ఇంకా కొంతమంది రైతుల ఖాతాలకు చేరనేలేదు. ఏడాదిలోగా పంటల బీమా పరిహారం ఇస్తామని, 2020 ఖరీఫ్‌ పంటల బీమా సొమ్మును మళ్లీ ఖరీఫ్‌ సీజన్‌ మొదలయ్యేలోగా రైతుల ఖాతాలకు నేరుగా జమ చేస్తున్నామంటూ సీఎం జగన్‌ 25నే బటన్‌ నొక్కినా, గురువారం సాయంత్రానికీ ఖాతాల్లో సొమ్ము పడలేదని అనేకమంది రైతులు చెబుతున్నారు. దీనిపై జిల్లాల్లో ‘ఆంధ్రజ్యోతి’ ఆరా తీయగా.. 11.59లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.1,310కోట్లు బ్యాంకులు జమ చేస్తున్నట్లు తెలిసింది. 3.5లక్షల మందికి పైగా రైతుల బయోమెట్రిక్‌ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని క్షేత్రస్థాయిలో అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి సీఎం బటన్‌ నొక్కడానికి ముందురోజే 11.59లక్షల మంది రైతులకే పరిహారం ఇస్తున్నట్లు సంబంధిత శాఖ మంత్రి నుంచి ప్రకటన వెలువడింది. కానీ సీఎంవో అధికారులు మాత్రం అందరికీ చెల్లించనున్నట్లు సవరణ ప్రకటన చేశారు. సీఎం బటన్‌ నొక్కినా, లబ్ధిదారుల జాబితాలు పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని సమాచారం. అయితే ఖజానాలో నిధుల కొరతే దీనికి అసలు కారణమనే వాదన విన్పిస్తోంది. దీన్ని పక్కనపెట్టి, ఏడాది తర్వాత ఇచ్చే పరిహారానికి రైతుల వివరాలు సరిలేవంటూ, కాలయాపన చేయడం, పైగా అందరికీ ఇచ్చేస్తున్నామంటూ ప్రకటనలు గుప్పించడం గమనార్హం. 

 

ప్రస్తుతం పరిహారం సొమ్ము ఖాతాల్లో పడనివారికి రూ.510 కోట్ల దాకా చెల్లించాల్సి ఉంటుందని, à°ˆ చెల్లింపులు జరగడానికి ఇంకో వారం పడుతుందని à°¸ మాచారం. కరోనా కారణంగా రైతుల బయోమెట్రిక్‌ ప్రక్రియ పూర్తి కాలేదని, కొందరు రైతుల ఖాతాలకు ఆధార్‌, పాన్‌కార్డు అనుసంధానం కాకపోవడం వంటి కారణాలతో పశ్చిమగోదావరి జిల్లాలోని అనేక మండలాల్లో అర్హులైన వారికి బీమా సొమ్ము జమ కాలేదని  రైతులు చెప్పారు. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. కరోనా వేళ అనారోగ్యం పాలై à°¨ కొందరు రైతులు... à°ˆ సొమ్ము మందులకైనా వస్తాయని ఆశపడ్డారు. ఖాతాల్లో సొమ్ము పడాలంటే ఇంకో వారం పడుతుందని అధికారులు చెబుతుండటంతో వారంతా ఉసూరుమంటున్నారు. వరుస విపత్తులతో నిరుడు ఖరీ్‌ఫలో పంట నష్టపోయిన రైతులు బీమా పరిహారం కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు.