కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత సమస్యలు..

Published: Friday June 04, 2021

రోనా వైరస్‌ సోకిన వారికి స్టెరాయిడ్స్‌ ఎక్కువగా వాడితే కోలుకున్న తరువాత కొందరికి ఎముకలు బలహీనపడుతున్నాయి. పెలుసుగా మారి పుటుక్కున విరుగుతున్నాయి. ఇలాంటి  సమస్యలు ఇప్పుడు పలువురిలో కనిపిస్తున్నాయని ఆర్థోపెడిక్‌ వైద్యులు చెబుతున్నారు. కొవిడ్‌ వచ్చి తగ్గిన వారిలో తుంటి, వెన్ను, మణికట్టు ప్రాంతాల్లో ఎక్కువగా చిట్లుతున్నట్లు చెబుతున్నారు.  కొంతమంది మూడు, నాలుగు నెలల వరకు కండరాల నొప్పులతో బాధపడుతున్నారు. కరోనా వైరస్‌ రెండోదశలో స్టెరాయిడ్స్‌ వినియోగం బాగా పెరిగింది. రోగి పరిస్థితి విషమంగా ఉండటంతో ఎక్కువ డోసును వాడుతున్నారు. దాంతో రోగి వైరస్‌ బారినుంచి బయటపడినా, à°† తర్వాత అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా ఆస్టియోపొరాసిస్‌ సమస్య లు వస్తున్నాయని వైద్యులు తెలిపారు. కొంత మంది ముందుకు వంగి నడుస్తుంటారు. వెన్నులో ఎక్కడో à°’à°• చోట చిట్లడం వల్లే ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పారు.  వెంటనే గుర్తించకపోవడం వల్ల ఎముకలు విరగడానికి అవకాశం ఉంటుందన్నారు. 50 ఏళ్లు దాటినవారికి మధుమేహం, థైరాయిడ్‌, గుండె జబ్బులు మొదలవుతాయి. అలాంటి వారికి కొవిడ్‌ సోకడంతో అదనంగా స్టెరాయిడ్స్‌ వాడితే ఎముకల బలం బాగా తగ్గిపోతుందని చెప్పారు. 

అవుట్‌పేషెంట్ల విభాగంలో  50 కేసుల వరకు ఆస్టియోపొరాసి్‌సకు చికిత్స చేశాం. ఆరుగురికి ఎముకలు చిట్లి ఉన్నాయి. ఎముకల శక్తికి ఇంజెక్షన్లు ఇస్తాం. కాళ్లు బలహీనంగా మారితే ఆపరేషన్‌ చేస్తాం. 50 ఏళ్లు దాటిన వారు కాల్షియం, à°¡à°¿-విటమిన్‌ తప్పని సరిగా తీసుకోవాలి.  

డాక్టర్‌ కల్యాణ్‌, ఆర్థోపెడిక్‌, స్పైన్‌ సర్జన్‌, సన్‌షైన్‌ ఆస్పత్రి

చాలా మంది శరీరం, కండరాల నొప్పులతో బాధపడుతున్నారు. దీన్ని ఫైబ్రోమైయాల్జియాగా వ్యవహరిస్తాం. కరోనా వచ్చిన90 శాతం మందిలో à°ˆ తరహా ఇబ్బందులు ఉంటున్నాయి. వారికి తగిన వ్యాయమం సూచిస్తున్నాం. కొందరికి తుంటి లో బాలును రీప్ల్లేస్‌ చేయాల్సి వస్తుంది.