సెకండ్‌ వేవ్‌లో కరోనా విస్ఫోటానికి కారణ‘భూతం’ ఈ వేరియంటే

Published: Saturday June 05, 2021

దేశాన్ని వణికించిన సెకండ్‌ వేవ్‌ ఉధృతికి ఏ కరోనా వేరియంట్‌ కారణం? అనేది తెలుసుకునేందుకు ఇండియన్‌ సార్స్‌ కరోనా వైరస్‌ జీనోమిక్‌ కన్సార్టియా (ఐఎన్‌ఎస్‌ఏసీఓజీ), నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో కీలక విషయం వెలుగుచూసింది. ‘డెల్టా’ కరోనా వేరియంట్‌ (బి.1.617.2) సెకండ్‌వేవ్‌లో అత్యంత వేగంగా వ్యాపించి కొవిడ్‌ కేసులు భారీగా పెరగడానికి దారితీసిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్రిటన్‌లోని కెంట్‌ కౌంటీ పరిధిలో గుర్తించిన ‘ఆల్ఫా’ వేరియంట్‌ (బి.1.1.7) కంటే డెల్టా వేరియంట్‌ వ్యాప్తిరేటు 50శాతం ఎక్కువని, ఇది అత్యంత ప్రమాదకరమైందని వెల్లడించారు.

అయితే కరోనా ఇన్ఫెక్షన్‌ తీవ్రత పెరగడానికి, మరణాలు పెరగడానికి డెల్టా వేరియంటే కారణం అనేందుకు తగిన ఆధారాలు లేవన్నారు. ఇప్పటివరకు దేశంలోని 29,000 కొవిడ్‌ కేసుల శాంపిళ్ల జన్యుక్రమాల (జీనోమ్‌ సీక్వెన్సింగ్‌)ను విశ్లేషించగా 8,900 శాంపిళ్లలో డబుల్‌ మ్యుటెంట్‌ (బి.1.617) కరోనా వేరియంట్‌ను గుర్తించినట్లు వివరించారు. డెల్టా వేరియంట్‌ అనేది డబుల్‌ మ్యుటెంట్‌ ఉపవర్గానికి చెందినది. మొత్తం 8,900 డబుల్‌ మ్యుటెంట్‌ శాంపిళ్లలో 1000కిపైగా డెల్టా వేరియంట్‌ శాంపిళ్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సెకండ్‌ వేవ్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరగడంలో డెల్టా వేరియంట్‌ పాత్ర కూడా ఉందన్నారు. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న పలువురికి సోకిన వైరస్‌ రకాలపై అధ్యయనం జరపగా, డెల్టా వేరియంటే టీకా లబ్ధిదారులకు ఎక్కువగా సోకిందని గుర్తించడం గమనార్హం. ఇప్పటివరకు జరిపిన జన్యుక్రమాల విశ్లేషణ ప్రకారం దేశంలో 12,200కుపైగా కరోనా వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నాయని చెప్పారు.

అయితే సెకండ్‌ వేవ్‌ మొదలైనప్పటి నుంచి వీటన్నింటి కంటే డెల్టా వేరియంట్‌ వ్యాప్తిరేటు గణనీయంగా పెరిగిందన్నారు. ఇక ఫైజర్‌ కంపెనీ కరోనా టీకాను తీసుకున్న వారిలో డెల్టా వేరియంట్‌ను నిర్వీర్యం చేసే యాంటీబాడీలు సాధారణ స్థాయి కంటే ఐదువంతులు తక్కువగా విడుదలవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్రిటన్‌లోని ఫ్రాన్సిస్‌ క్రిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు 250 మంది ఫైజర్‌ టీకా లబ్ధిదారుల రక్తనమూనాలను సేకరించి, వాటిపైకి వేర్వేరుగా ఐదు కరోనా వైరస్‌ వేరియంట్లను ప్రవేశపెట్టారు. దీనికి ప్రతిస్పందనగా యాంటీబాడీలు ఎంతమోతాదులో విడుదలయ్యాయి అనేది నమోదుచేశారు. రక్త నమూనాలు డెల్టా వేరియంట్‌ ప్రభావానికి లోనైనప్పుడు.. యాంటీబాడీల విడుదల ఐదు వంతులు తగ్గడాన్ని గుర్తించారు. వయసు పెరిగే కొద్దీ యాంటీబాడీల విడుదల భారీగా తగ్గిందని, ఇవి చాలా త్వరగా నశించాయని పేర్కొన్నారు. ఈమేరకు వివరాలతో ‘ది లాన్సెట్‌’ జర్నల్‌లో పరిశోధనా పత్రం ప్రచురితమైంది.

 

దేశంలో కరోనా రెండో దశ తీవ్రతకు బి.1.617 à°°à°•à°‚ వైరస్‌కు చెందిన డెల్టా (బి.1.617.2) వేరియంట్‌ ప్రధాన కారణమని హైదరాబాద్‌లోని జాతీయ పరిశోధనా సంస్థ సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) వెల్లడించింది. వారాణసీలో ఏప్రిల్‌, మే నెలల్లో కరోనా వందలాది మందిని బలి తీసుకుంది. ఇందుకు కారణాలను తెలుసుకోవడంపై వారణాసిలోని బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, సీసీఎంబీ ఉమ్మడి అధ్యయనం చేపట్టాయి. వారాణసీ చుట్టుపక్కల నుంచి ఏప్రిల్‌లో 130 జన్యు నమూనాలను సేకరించి వాటిని అధ్యయనం చేశామని అక్కడ కనీసం ఏడు వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నట్లు వెల్లడైందని సీసీఎంబీ శుక్రవారం తెలిపింది.

 

‘వారణాసిలో మేం చేపట్టిన అధ్యయనంలో 36% నమూనాల్లో డెల్టా వేరియంట్‌ కనిపించింది. దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వైరస్‌ విజృంభణకు బి.1.167 à°°à°•à°‚ కరోనా వైర్‌సకు చెందిన బి.1.167.2 (డెల్టా) వేరియంట్‌ ప్రధాన కారణమ’ని సీసీఎంబీ సలహాదారు డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. తొలిసారిగా దక్షిణాఫ్రికాలో కనిపించిన బి.1.351 వేరియంట్‌ కూడా వారాణసీ ప్రాంతంలో కనిపించిందని తెలిపారు. ‘బి.1.167 à°°à°•à°‚ కరోనా వైరస్‌ వారాణసీలో అధికంగా వ్యాప్తిలో ఉంది. దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వ్యాప్తికి కూడా à°ˆ à°°à°•à°‚ వైరస్‌ మూలకారణం’ అని బెనారస్‌ విశ్వవిద్యాలయం మల్టీ డిసిప్లినరీ పరిశోధనా విభాగం సారథి ప్రొఫెసర్‌ సింగ్‌ తెలిపారు.  

యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో కరోనా డెల్టా వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయి. à°—à°¤ వారం 201 కేసులు నమోదవగా, à°ˆ వారం 278 కేసులకు à°ˆ సంఖ్య పెరిగింది. జూన్‌ 21 నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయనున్న నేపథ్యంలో డెల్టా కేసులు అధికమవుతుండటం యూకేలో ఆందోళనకర పరిణామంగా మారింది. యూకేలోని కెంట్‌ ప్రాంతంలో డెల్టా వేరియంట్‌ కేసులను మొదటగా గుర్తించారు. బాధితుల్లో వ్యాక్సినేషన్‌ వేయించుకోనివారు ఎక్కువగా ఉన్నారు. కరోనా వేరియంట్ల వ్యాప్తిని పర్యవేక్షిస్తోన్న పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌ (పీహెచ్‌à°ˆ) à°ˆ విషయాలను వెల్లడించింది. ఆల్ఫా వేరియంట్‌ కేసుల సంఖ్యను డెల్టా వేరియంట్‌ అధిగమించడం ఆందోళనకరమని పీహెచ్‌à°ˆ పేర్కొంది. దేశవ్యాప్తంగా డెల్టా వేరియంట్‌ ప్రభావం ఉన్నందున ప్రజలందరూ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని యూకే హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఓ జెన్నీ హారీస్‌ అన్నారు. ఆల్ఫా వేరియంట్‌ కంటే డెల్టా à°°à°•à°‚ 50శాతం అధికంగా ఇన్ఫెక్షన్లకు దారితీయగలద