విదేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో ప్రమాదకర వేరియంట్‌ ‘బి.1.1.28.2’ను

Published: Monday June 07, 2021

భారత్‌లో కరోనా వైర్‌సకు సంబంధించిన ప్రమాదకర వేరియంట్‌ ‘బి.1.1.28.2’ను గుర్తించారు. బ్రెజిల్‌లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ వేరియంట్‌.. వారం రోజుల్లోనే రోగి శరీర బరువును భారీగా తగ్గించగలదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. డెల్టా వేరియంట్‌ తరహాలోనే ఇది కూడా.. మానవ రోగ నిరోధక వ్యవస్థ విడుదల చేసే యాంటీబాడీల సామర్థ్యాన్ని తగ్గించగలదని పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) పరిశోధకులు వెల్లడించారు. విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన ఇద్దరు వ్యక్తుల జన్యుక్రమాల (జీనోమ్‌ సీక్వెన్సింగ్‌)ను విశ్లేషించగా ‘బి.1.1.28.2’ వేరియంట్‌ను గుర్తించినట్లు తెలిపారు. దీన్ని 9 ఎలుకల్లోకి ప్రవేశపెట్టి పరీక్షించగా, ఇన్ఫెక్షన్‌ సోకిన వారం రోజుల్లోనే లక్షణాలు బయటపడటం ప్రారంభమైందన్నారు. శరీరంలో ఇన్ఫెక్షన్‌ భారీగా వ్యాపించడంతో మూడు ఎలుకలు చనిపోయాయని పేర్కొన్నారు. ప్రస్తుతానికి దేశంలో దీని కేసులు ఎక్కువగా లేవని శాస్త్రవేత్తలు స్పష్టంచేశారు. కరోనా వైర్‌సకు చెందిన రెండు వేరియంట్లు ఇప్పటివరకు బ్రెజిల్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన విషయాన్ని వారు ఈసందర్భగా గుర్తుచేశారు.