డ్రాగన్ దేశంలో ఇప్పుడిదే హాట్‌టాపిక్..

Published: Wednesday June 09, 2021

ప్రపంచంలో ఏ వస్తువుకు డూప్లికేట్ కావాలన్నా చైనాలో దొరుకుతుందని జోకులేసుకోవడం వింటాం. కానీ నిజంగానే చైనా ప్రతి వస్తువుకూ డూప్లికేట్ తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటుందేమో అనిపించేలా à°’à°• వినూత్న ప్రయోగం చేస్తోంది. à°ˆ ప్రయోగంలో చైనా దేని డూప్లికేట్‌ను తయారు చేస్తోందో తెలుసా? సూర్యుడికి నకిలీ. అవును, ప్రతిరోజూ ఉదయాన్నే ప్రపంచం మొత్తాన్ని వెచ్చటి కిరణాలతో నిద్రలేపే సూర్యభగవానుడికి డూప్లికేట్ తయారు చేయడానికి చైనా రెడీ అయిపోయింది. à°ˆ ప్రయోగం ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయింది కూడా. ఎక్స్‌పెరిమెంటల్ అడ్వాన్స్‌డ్ సూపర్ కండక్టింగ్ టొకామక్(ఈఏఎస్‌à°Ÿà±€-ఈస్ట్) అని పిలిచే à°ˆ మెషీన్ సూర్యుడి కన్నా పది రెట్ల ఎక్కువ వేడితో మండుతోందట. అసలు చైనా ఇలా మరో సూర్యుడిని ఎందుకు తయారు చేయాలని అనుకుంటోంది? అసలేంటీ ప్రయోగం?

శక్తి ఉత్పత్తిలో మనకు తెలిసిన పద్ధతులు మూడు. బొగ్గు మండించడం, టర్బైన్లు తిప్పడం, న్యూక్లియర్ రియాక్టర్ల సాయంతో శక్తిని ఉత్పన్నం చేయడం మానవాళికి తెలుసు. అయితే ఇంతకాలం మనం శక్తిని ఉత్పత్తి చేయడం కోసం న్యూక్లియర్ ఫిషన్ అనే పద్ధతి ఉపయోగించేవాళ్లం. ఈ పద్ధతిలో చాలా పెద్ద మొత్తాల్లో వ్యర్థ పదార్థాలు వెలువడతాయి. కానీ సూర్యుడు వంటి నక్షత్రాలను పరిశీలిస్తే వాటిలో కూడా అధిక మొత్తాల్లో శక్తి ఉత్పన్నం అవుతుంది. కానీ వ్యర్థాలు చాలా తక్కువ. దీనికి కారణం ఈ నక్షత్రాల్లో న్యూక్లియర్ ఫ్యూషన్ విధానంలో శక్తి ఉత్పత్తి అవడమే. ఈ పద్ధతిలోనే మానవాళి కూడా వ్యర్థాలు తక్కువగా ఉండేలా శక్తిని ఉత్పత్తి చేయొచ్చు కదా అనే ఆలోచనతోనే ఈస్ట్ టెక్నాలజీని చైనా అభివృద్ధి చేస్తోంది.

అయితే à°ˆ న్యూక్లియర్ ఫ్యూషన్ జరగాలంటే.. హైడ్రోజన్ అణువులపై భారీ స్థాయిలో వేడి, ఒత్తిడి తీసుకురావాలి. అలా చేస్తేనే హైడ్రోజన్ అణువులు ఒకదానికొకటి కలుస్తాయి. అంటే ఫ్యూజ్ అవుతాయన్నమాట. హైడ్రోజన్‌లో ఉండే డ్యూటిరియం, ట్రిటియం రెండూ కలిసి హీలియం న్యూక్లియస్‌ను తయారు చేస్తాయి. దీనిలో à°’à°• న్యూట్రాన్, దాంతోపాటు పెద్దమొత్తంలో శక్తి ఉంటుంది. à°ˆ పద్ధతిలో ఇంధనాన్ని అధిక ఉష్ణోగ్రతలు అంటే 150 మిలియన్ డిగ్రీల సెల్సియస్‌ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేడి చేస్తారు. అది సబ్ ఆటమిక్ కణాలతో కూడిన భగభగలాడే ప్లాస్మా ‘సూప్’అని పిలిచే పదార్థాన్ని ఏర్పరుస్తుంది. à°ˆ ప్లాస్మా రియాక్టర్ గోడలను తాకకుండా బలమైన అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇది రియాక్టర్ గోడలకు తగిలితే దాని వేడి తగ్గిపోతుంది. తద్వారా దాని ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తి కూడా తగ్గుతుంది. à°ˆ ప్లాస్మాను చాలా సేపు అలా పక్కన పెట్టేస్తే ఫ్యూజన్ జరుగుతుంది.

ఇలా శుభ్రమైన, వ్యర్థాలు లేని శక్తిని ఉత్పత్తి చేయడం కోసమే చైనా à°ˆ ఆర్టిఫీషియల్ సన్(కృత్రిమ సూర్యుడు) ప్రయోగం చేపట్టింది. à°ˆ ఈస్ట్ రియాక్టర్‌లో à°—à°¤ శుక్రవారం నాడు ప్లాస్మా వేడి రికార్డు స్థాయిలో 216 మిలియన్ డిగ్రీల ఫారెన్‌హీట్‌కు చేరింది. ఇది సెల్సియస్‌ లెక్కల్లో 120 మిలియన్ డిగ్రీలు. అంతేకాదు à°’à°• 20 సెకన్లపాటు 288 మిలియన్ డిగ్రీల ఫారెన్‌హీట్ (160 మిలియన్ డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రతలు నమోదు చేసిందిట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. సూర్యుడి కేంద్ర వద్ద ఉండే ఉష్ణోగ్రత కూడా 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్సే. అంటే చైనా తయారు చేసిన రియాక్టర్‌లో వేడి సూర్యుడి కేంద్రంలోని వేడికి పది రెట్లు ఉందన్నమాట. à°ˆ ఈస్ట్ ప్రాజెక్టు ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్ (ఐటీఈఆర్) ఫెసిలిటీలో భాగం. ఇది 2035లో పనిచేయడం ప్రారంభిస్తే.. ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్‌à°—à°¾ రికార్డు సృష్టిస్తుంది. à°ˆ ప్రాజెక్టులో భారత్ సహా దక్షిణ కొరియా, జపాన్, రష్యా, అమెరికా దేశాలు కూడా సహకారం అందిస్తున్నాయి.

 

కాగా, చైనా తయారు చేస్తున్న ఈస్ట్.. à°ˆ కమ్యూనిస్టు దేశంలోని మూడో డొమెస్టిక్ టొకమాక్. ప్రస్తుతం డ్రాగన్ కంట్రీలో ఇప్పటికే రెండు న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. అవే హెచ్ఎల్-2ఏ, జె-టెక్స్ట్. చైనాలోని అతిపెద్ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ అయిన హెచ్ఎల్-2ఎమ్ టొకామక్ తొలిసారిగా 2020 డిసెంబరులో ప్రారంభమైంది. ఇది చైనా న్యూక్లియర్ పవర్ పరిశోధనా సామర్థ్యాలను సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లింది. అయితే à°ˆ రంగంలో పరిశోధనల్లో చైనా ఇంకా ఎంతో ముందుకెళ్లాలని చైనీస్ సైంటిస్టులు అంటున్నారు. అయితే ఇలాంటి పరిశోధనలు చేస్తోంది చైనా ఒక్కటే కాదు. 2020లోనే దక్షిణ కొరియా కూడా తమ కెస్టార్ రియాక్టర్‌లో ప్లాస్మా తయారు చేసి రికార్డు సృష్టించింది. à°ˆ ప్లాస్మా ఉష్ణోగ్రతలు 20 సెకన్లపాటు 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్‌కు చేరినట్లు సమాచారం.