‘జల్‌ జీవన్‌ మిషన్‌’ ద్వారా ఏపీకి 3,183 కోట్లు

Published: Tuesday June 15, 2021

‘జల్‌ జీవన్‌ మిషన్‌’ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ పైపులైన్ల ద్వారా రక్షిత మంచినీరు అందించాలనేది కేంద్రప్రభుత్వ లక్ష్యమని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. à°ˆ క్రమంలో 2024 నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి గ్రామీణ గృహానికీ కుళాయి కనెక్షన్ల ద్వారా సురక్షిత మంచినీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొంది. దీనికోసం ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ ద్వారా 2021-22 సంవత్సరానికి గాను ఏపీకి రూ.3,182.88 కోట్లు కేటాయించినట్లు à°† శాఖ సోమవారం ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే à°ˆ పథకం à°•à°¿à°‚à°¦ నిధుల కేటాయింపును నాలుగు రెట్లు పెంచినట్లు à°† శాఖ తెలిపింది. 2020-21లో ఏపీకి రూ.790.48 కోట్లు మాత్రమే మంజూరు చేసినట్లు వెల్లడించింది. 2020-21లో ఏపీకి రూ.790.48 కోట్ల నిధులు అందించగా.. ఇప్పటి వరకు 12.97 లక్షల కుళాయి కనెక్షన్లు ఇచ్చి, à°ˆ నిధుల్లో 297.62 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు జలశక్తిశాఖ పేర్కొంది. రాష్ట్రంలో ఇంకా 874 గ్రామాల్లో కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని తెలిపింది. 

 

ఏపీకి నిర్దేశించిన లక్ష్యం మేరకు నెలకు 4 లక్షల కనెక్షన్లు అందించాల్సి ఉందని, à°ˆ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు పేర్కొంది. 2021-22లో 32.47 లక్షల గృహాలకు, 2022-23లో 12.38 లక్షల గృహాలకు, 2023-24లో ఆరు లక్షల గృహాలకు మంచినీటి కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు జలశక్తి మంతిత్వశాఖ పేర్కొంది. కాగా.. దేశంలో à°ˆ కార్యక్రమాన్ని 2019లో ప్రారంభించే నాటికి మొత్తం 19.20 కోట్ల గ్రామీణ గృహాల్లో కేవలం 3.23 కోట్లు అంటే 17 శాతమే కుళాయిల ద్వారా రక్షిత నీటి సరఫరా జరిగేదని, à°—à°¤ 21 నెలల్లో కొవిడ్‌ మహమ్మారి, లాక్‌డౌన్‌ అంతరాయాలు ఉన్నప్పటికీ 4.29 కోట్ల గ్రామీణ గృహాలకు మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7.52 కోట్ల (39.22శాతం) గ్రామీణ కుటుంబాలు మంచినీటి సదుపాయం పొందినట్లు పేర్కొంది.