ఏపీకి మరో 9 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు

Published: Thursday June 17, 2021

ఏపీకి మరో 9 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో 75 బాక్సుల్లో టీకా డోసులు రాష్ట్రానికి తరలివచ్చాయి. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్‌ను అధికారులు తరలించారు. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్ తరలి వెళ్లనుంది. తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం కలగనుంది.