మ్యాచ్‎కు వాన గండం

Published: Friday June 18, 2021

144 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రను సమున్నత స్థాయిలో నిలిపేందుకు భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు సిద్ధమయ్యాయి. క్రికెట్‌ ప్రపంచానికి సరికొత్త అనుభవమైన తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌à°·à°¿‌ప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో శుక్రవారం నుంచి తలపడబోతున్నాయి. ఇందుకు స్థానిక ఏజెస్‌ బౌల్‌ వేదిక కానుంది. రెండేళ్ల నుంచి ప్రత్యర్థులపై అద్భుత పోరాటంతో గెలుస్తూ.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ దాకా చేరిన వేళ à°ˆ ఆఖరి సమరంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. కోహ్లీ సేన ఆధ్వర్యంలోనూ తొలి ఐసీసీ ట్రోఫీ కోసం భారత్‌ ఎదురుచూస్తోంది.

 

à°ˆ టెస్ట్ చాంఫియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‎కు వరుణుడు అడ్డు వచ్చేలా ఉన్నాడు. సౌతాంప్టన్‎లో à°“ మోస్తార్ నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందేహం ఏర్పడుతోంది. వర్షం పడకపోయినా..మ్యాచ్ జరుగుతున్న సమయంలో పదేపదే చిరుజల్లులతో టెస్టు మ్యాచ్ కు అంతరాయం కలిగే అవకాశం కన్పిస్తోంది.

 

సౌతాంప్టన్‎లో 91 శాతం వర్షం పడే చాన్స్ ఉందని వివిధ వాతావరణ సమాచార వెబ్ సైట్లు తెలుపుతున్నాయి. శుక్రవారం మొత్తం ఆకాశంలో మబ్బులు కమ్ముకునే అవకాశం ఉంది. అలాగే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే ఆస్కారం ఉంది. శుక్రవారం ఉదయం 6 à°—à°‚à°Ÿà°² నుంచి శనివారం ఉదయం 6 à°—à°‚à°Ÿà°² వరకు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని బ్రిటన్ వాతావరణశాఖ తెలిపింది. దీంతో అభిమానుల్లో మ్యాచ్ జరుగుతుందో లేదో అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు సౌతాంప్టన్ లో వాతావరణం ఎలా ఉందో ఐసీసీ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.