జనవరిలో పైలట్ సేవలు ప్రారంభించనున్న టెలికాం సంస్థ

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్ కూడా మేడ్ ఇన్ ఇండియా 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం టాటా గ్రూప్‌తో ఎయిర్‌టెల్ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. టాటా గ్రూప్‌నకు చెందిన ఐటీ కంపెనీ టీసీఎస్.. ఓపెన్ రేడియా యాక్సెస్ నెట్‌వర్క్ (ఓ-రాన్) ఆధారిత 5జీ రేడియో, కోర్ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసింది. ఈ నెట్‌వర్క్ సొల్యూషన్ ద్వారా 2022 జనవరి నుంచి 5జీ పైలట్ సేవలను ప్రారంభించనున్నట్లు ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. స్వదేశీ టెక్నాలజీ వినియోగం ద్వారా కంపెనీకి వ్యయాన్ని తగ్గించుకునే అవకాశం లభించనుంది.
రిలయన్స్ జియో సొంతంగా ఎండ్ టు ఎండ్ టెలికాం స్టాక్ (5జీ రేడియో, కోర్ సొల్యూషన్స్ టెక్నాలజీ)ను అభివృద్ధి చేసుకుంది. ఇప్పటికే ముంబైలో పైలట్ సేవలందిస్తోన్న సంస్థ.. 5జీ స్పెక్ట్రమ్ అందుబాటులోకి రాగానే వాణిజ్య సేవలనూ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది.
ఓ-రాన్ అలయన్స్‌లో సభ్యత్వం కలిగిన ఎయిర్‌టెల్.. భారత్‌లో ఈ టెక్నాలజీ ఆధారిత నెట్‌వర్క్‌ను వినియోగించేందుకు కట్టుబడి ఉంది. ఈ ఏడాది హైదరాబాద్‌లో లైవ్ నెట్‌వర్క్ ద్వారా కంపెనీ తన 5జీ సేవల సామర్థ్యాల్ని ప్రదర్శించింది. టెలికాం శాఖ 4జీ కోసం కేటాయించిన స్పెక్ట్రమ్‌పైనే కంపెనీ పలు నగరాల్లో 5జీ ట్రయల్స్‌ను ప్రారంభించింది

Share this on your social network: