కోటి ఇవ్వాల్సిందే.. వార్నింగ్

Published: Thursday June 24, 2021

రాష్ట్రాల బోర్డుల పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. సుమారు గంటన్నర పాటు జరిగిన వాదనలు కొద్దిసేపటి క్రితమే ముగిశాయి. ఇరువైపులా వాదానలు విన్న దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు పరీక్షలు నిర్వహించాలా..? లేక రద్దు చేయాలా..? అనే దానిపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్నది. ప్రతి గదిలో 15 నుంచి 18 మందికి పరీక్షలు నిర్వహిస్తే ..34, 634, రూమ్స్  ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ధర్మాసనం వెల్లడించింది. పరీక్షల తేదీలు, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల సేఫ్టీ అంశంపై ప్రణాళికలు ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. ఏ ఒక్క విద్యార్థి మృతి చెందినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని రెండ్రోజుల క్రితమే ఏపీ ప్రభుత్వాన్ని కోర్టు à°’à°•à°¿à°‚à°¤ హెచ్చరించిన విషయం విదితమే.

అంతేకాదు.. à°ªà°°à±€à°•à±à°·à°² సందర్భంలో ఎవరైనా విద్యార్థులు మరణిస్తే ఒకొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని కూడా కోర్టు హెచ్చరించింది. పరీక్షల సమయంలో కోవిడ్ ఉధృతి పెరిగితే దానిపై కూడా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్కుల ఎవల్యూషన్‌పై కూడా తాము నిపుణులతో మాట్లాడి à°’à°• చార్ట్ ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం à°ˆ విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. à°ˆ విచారణను జస్టిస్ ఏ à°Žà°‚ ఖన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం చేపట్టింది. 

ఇప్పటికే 10,12 తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం, 11 తరగతి పరీక్షలు నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపాయి. మరోవైపు ఇప్పటికే 21 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయి. 12 వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని, ప్రత్యామ్నాయం లేదని సుప్రీంకోర్టులో బుధవారం నాడు ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన విషయం విదితమే.