కరోనా నేపథ్యంలో మానసిక సమస్యలు

కరోనా నేపథ్యంలో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నవారి సంఖ్య ఢిల్లీలో బాగా పెరిగినట్టు వివిధ ఆస్పత్రులకు చెందిన వైద్యులు వెల్లడించారు. నిరాశ, భయాందోళనలు, నిద్రపట్టకపోవడం వంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య ఎక్కువైందని తెలిపారు. రాజధానిలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ప్రభావం చూపడం, గతంలో కంటే అధికంగా మరణాలు నమోదుకావడంతో మానసిక సమస్యలు పెరిగాయని చెప్పారు. కరోనా మహమ్మారి వల్ల కుటుంబ సభ్యులను, మిత్రులను, బంధువులను కోల్పోయినవారిలో ఈ సమస్యలు అధికంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇంట్లో అందరికీ కరోనా సోకిన కుటుంబాలు చాలా ఉన్నాయని, ఇలాంటి సందర్భాల్లో ఒకరినొకరు దగ్గరకు తీసుకొని ఓదార్చే పరిస్థితి కూడా లేకపోవడం, ఒంటరిగానే బాధలను దిగమింగుకోవాల్సి రావడం వల్ల మానసికంగా కుంగిపోయినవారు నిపుణులను సంప్రదిస్తున్నారని వైద్యులు తెలిపారు. గతంలో ఏవైనా మానసిక సమస్యలు ఉన్నవారు... ప్రస్తుత పరిస్థితుల్లో మరింత ఇబ్బందిపడుతున్నారని చెప్పారు.

Share this on your social network: