దేశంలో 32.36 కోట్ల టీకా డోసుల పంపిణీ

రోనా టీకా పంపిణీలో భారత్.. అమెరికాను అధిగమించింది. సోమవారం ఉదయం వరకు దేశంలో 32.36కోట్లపైగా డోసులు వినియోగమయ్యాయి. మనకంటే నెల ముందుగానే వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన అగ్రరాజ్యంలో ఇప్పటిదాక 32.33కోట్ల డోసులు పంపిణీ చేశారు. అయితే, అమెరికా జనాభాలో 46.5ు(15.30కోట్లు)మందికి రెండు డోసులూ పూర్తవగా.. భారత్‌లో 4ు(5.60కోట్ల) మందికే రెండు డోసులు అందాయి. కాగా, దేశంలో గత వారం నుంచి 18ఏళ్లపైబడిన వారికి ఉచిత వ్యాక్సినేషన్ మొదలైంది. పంపిణీ జోరుగా సాగుతోంది. వారంలోనే 4 కోట్ల మందిపైగా ప్రజలకు వ్యాక్సిన్ వేశారు. దీంతో భారత్.. ఒక్కసారిగా ముందుకెళ్లింది.
మరోవైపు తమ దేశంలో వంద కోట్ల మందికి (వీరిలో 22 కోట్ల మందికి రెండు డోసులు) టీకా పంపిణీ చేసినట్లు ఇటీవల చైనా ప్రకటించుకుంది. ఈలెక్కన భారత్.. ప్రపంచంలో చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. కాగా, కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన బ్రెజిల్‌లో ఇంకా 10 కోట్ల మం దికే వ్యాక్సిన్ వేశారు. కాగా, డెల్టా ప్లస్ వేరియంట్ అతి వేగంగా వ్యాపిస్తుంది అనేందుకు, టీకా సామర్థ్యంపై ప్రభావం చూపుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని నీతీ ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్ తెలిపారు. జాగ్రత్తల పాటింపు, వైరస్ మ్యుటేషన్లు సహా అనేక అంశాలపై ఽథర్డ్ వేవ్ ఆధారపడి ఉంటుందని వివరించారు.
దేశంలో ఆదివారం 46,148 మందికి వైరస్ నిర్ధారణ అయింది. 979 మంది చనిపోయారు. గత 76 రోజుల్లో ఇవే అతి తక్కువ మరణాలు. యాక్టివ్ కేసులు 5.72 లక్షలకు తగ్గాయి. 15.70 లక్షల టెస్టులు చేశారు. పాజిటివ్ రేటు 2.94గా ఉంది. కాగా, ముంబైలోని 50ుపిల్లల్లో కొవిడ్ యాంటీబాడీలున్నట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చేపట్టిన సీరో సర్వేలో తేలింది. మే, జూన్‌లో 24 వార్డుల్లోని 6 నుంచి 18 ఏళ్లలోపు వయసువారు పదివేల మందిపై ఈ సర్వే నిర్వహించారు.

Share this on your social network: