వైద్య ఆరోగ్య రంగానికి 2 లక్షల కోట్ల కేటాయింపు

Published: Thursday July 01, 2021

 à°•à°°à±‹à°¨à°¾ లాంటి క్లిష్ట సమయంలో వైద్యులు ప్రజలకు అపారమైన సేవలందించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. à°ˆ సందర్భంగా దేశంలోని వైద్యులందరికీ  ఆయన ధన్యవాదాలు ప్రకటించారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ గురువారం ప్రసంగించారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘దేశంలోని వైద్యులందరికీ ధన్యవాదాలు ప్రకటిస్తున్నా. దేవుళ్ల లాగా పనిచేశారు. ఇంతలా పని చేసి ప్రజల ప్రాణాలను నిలబెట్టారు. కోవిడ్ కారణంగా చాలా మంది వైద్యులు తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. వారి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా. వైరస్ రకరకాలుగా మ్యూటేట్ అవుతున్నా... వైద్యుల అవగాహన కూడా పెరుగుతోంది’’ అంటూ మోదీ వ్యాఖ్యానించారు. ఇతర దేశాల కంటే భారత్ వైరస్‌తో చాలా వేగంగా పోరాటం సలిపిందని, ఇతర దేశాల పాజిటివిటీ రేటు, మరణాలను గమనిస్తే మనం చాలా బెటర్ అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వైద్య రంగంపై అధికంగా కృషి సలుపుతోందని, గతంలో 15 వేల కోట్లను కేటాయించిందని, à°ˆ సారి రెండు లక్షల కోట్ల రూపాయలను కేటాయించామని మోదీ గుర్తు చేశారు. 

à°ˆ సందర్భంగా మోదీ à°—à°¤ ప్రభుత్వాలను విమర్శిస్తూ ప్రసంగించారు. గతంలో వైద్య à°°à°‚à°—à°‚ మౌలిక సదుపాయాల నిమిత్తమై ప్రభుత్వాలు à°Žà°‚à°¤ ఖర్చు చేశాయో అందరికీ తెలుసని, à°ˆ à°°à°‚à°—à°‚ విస్మరణకు గురైందని పేర్కొన్నారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం పూర్తిగా à°ˆ రంగంపైనే ఫోకస్ పెట్టి పనిచేస్తున్నామని ఆయన వివరించారు. వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి 50 వేల కోట్ల రూపాయలతో à°“ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌ను కూడా పరిచయం చేశామని అన్నారు. వైద్యుల రక్షణ, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంంటుందని మోదీ హామీ ఇచ్చారు. 2014 వరకూ దేశంలో కేవలం 6 ఏయిమ్స్ సంస్థలు మాత్రమే ఉండేవని, à°ˆ ఏడు సంవత్సరాలలో 15 కొత్త ఎయిమ్స్‌లను అందుబాటులోకి తెచ్చామని, మెడికల్ కాలేజీల సంఖ్యను కూడా పెంచామని మోదీ తెలిపారు.