డెల్టా ప్లస్ వేరియంట్ నిజంగా ప్రమాదమా ..?

Published: Thursday July 01, 2021

 à°•à°°à±‹à°¨à°¾ వైరస్‌లోని డెల్టా ప్లస్ వేరియంట్ అత్యంత ప్రమాదకరమని తెలియజేసే సమాచారం అంతగా అందుబాటులో లేదని ఢిల్లీలోని à°…à°–à°¿à°² భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్)  డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. à°ˆ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని కానీ, దీనివల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తాయని కానీ చెప్పడానికి తగిన ఆధారాలు లేవన్నారు. ప్రజలు కోవిడ్-19 మార్గదర్శకాలను సక్రమంగా పాటిస్తూ, వ్యాక్సిన్ తీసుకుంటే, కొత్తగా వచ్చే వేరియంట్ల నుంచి కాపాడుకోవచ్చునని తెలిపారు. 

 

డాక్టర్ గులేరియా గురువారం à°“ వార్తా సంస్థతో మాట్లాడుతూ, డెల్టా ప్లస్ వేరియంట్‌పై పెద్దగా సమాచారం లేదన్నారు. ఇది ఎక్కువ వేగంతో వ్యాపించగలదని లేదా ఎక్కువ మంది మరణిస్తారని లేదా రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోగలుగుతుందని చెప్పడానికి తగిన సమాచారం అందుబాటులో లేదని తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ, వ్యాక్సిన్ వేయించుకుంటే, రాబోయే వేరియంట్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చునన్నారు. 

 

కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ వర్కర్లను డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ గులేరియా గుర్తు చేసుకున్నారు. గడచిన సంవత్సరం నుంచి డాక్టర్లు ఎంతో పోరాడుతున్నారని, వారి కృషిని ప్రశంసించాలని చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసినవారిని స్మరించుకోవాలన్నారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ, వ్యాక్సినేషన్ చేయించుకోవాలని, తద్వారా డాక్టర్లపై ఒత్తిడిని తగ్గించాలని కోరారు.