ఈ మూడు చైనా బ్రాండ్ల అమ్మకాలపై నిషేధం..

చైనాకు చెందిన మరో మూడు ఎలక్ట్రానిక్స్ సంస్థలకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ షాకిచ్చింది. ఆ సంస్థలకు చెందిన ఉత్పత్తులను తన ప్లాట్‌ఫామ్ నుంచి నిషేధించింది. కస్టమర్లకు గిఫ్ట్‌కార్డులు ఎరగా వేసి అమెజాన్‌లోని తమ ప్రొడక్టులకు ఫేక్ రివ్యూలను రాయించుకుంటున్నట్టు తేలడంతో వాటిపై వేటు వేసింది. చైనాలోని సన్‌వ్యాలీ కంపెనీకి చెందిన RAVPower power banks, Taotronics earphones, VAVA cameras అమ్మకాలపై నిషేధం విధిస్తూ అమెజాన్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చైనాకు చెందిన 16 బ్రాండ్లను ఇదే కారణంతో అమెజాన్ నిషేధించిన సంగతి తెలిసిందే. తాజా నిషేధంతో బ్యాన్ అయిన చైనీస్ సంస్థల సంఖ్య 19కి చేరింది. వీటిలో బైట్ డ్యాన్స్‌కు చెందిన ఓ సంస్థ కూడా ఉండడం విశేషం.
అమెజాన్‌లోని తమ ఉత్పత్తుల గురించి పాజిటివ్ రివ్యూలు రాస్తే గిఫ్ట్ కార్డులు ఇస్తామని చైనాకు చెందిన ఈ కంపెనీలు తమ వెబ్‌సైట్లలో పెట్టాయి. ఈ విషయం అమెజాన్ యాజమాన్యం దృష్టికి రావడంతో వాటిని నిషేధించింది. రివ్యూ సిస్టమ్‌ను అపహాస్యం చేసేలా ఆ సంస్థలు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిషేధాల కారణంగా చైనా సంస్థలకు చెందిన బిలియన్ డాలర్ల ఉత్పత్తులు అమెజాన్ నుంచి దూరం అయిపోయాయి.

Share this on your social network: