సింగిల్‌ డోసుతో 29 రోజుల్లోనే కరోనా వేరియంట్‌ నిర్వీర్యం

Published: Saturday July 03, 2021

 à°ªà±à°°à°ªà°‚చవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్న ‘డెల్టా’ కరోనా వేరియంట్‌పై తమ సింగిల్‌ డోసు కొవిడ్‌-19 టీకా ప్రభావవంతంగా పనిచేస్తుందని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ ప్రకటించింది. వ్యాక్సిన్‌ను ఇచ్చిన 29 రోజుల్లోనే యాంటీబాడీలు విడుదలై డెల్టా వేరియంట్‌ను నిర్వీర్యం చేశాయని తెలిపింది. మూడోదశ ప్రయోగ పరీక్షల్లో పాల్గొన్న ఎనిమిది మంది వలంటీర్ల రక్త నమూనాల విశ్లేషణలో ఈవిషయాన్ని గుర్తించినట్లు వెల్లడించింది.

 

టీకాను తీసుకున్న వారిలో దాదాపు 8 నెలల పాటు యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని, à°† తర్వాతా చెప్పుకోదగ్గ స్థాయిలో వాటి ఉత్పత్తి కొనసాగిందని పేర్కొంది. డెల్టా వేరియంట్‌తో పాటు బీటా, జీటా à°°à°•à°‚ కరోనా వైర్‌సలపైనా తమ టీకా ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడైందని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పాల్‌ స్టోఫెల్స్‌ తెలిపారు.

 

‘‘మొదటి డోసు తీసుకున్న వారంతా ఏడాదిలోగా బూస్టర్‌ డోసు వేయించుకోవాల్సి వస్తుందని మేం భావించడం లేదు. ఒకవేళ బూస్టర్‌ డోసే అవసరమైతే.. ఇప్పటి టీకా ఫార్ములాలో ఎలాంటి మార్పు లూ చేయనక్కర్లేదు’’ అని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్ల విభాగాధిపతి జొహాన్‌ వాన్‌ హూఫ్‌ వ్యాఖ్యానించారు.