ప్రపంచవ్యాప్తంగా ఎందుకింత ఆసక్తి..?

Published: Monday July 05, 2021

కరోనా ముప్పెట దాడిని తిప్పికొట్టే శక్తివంతమైన ఆయుధం టీకా..! అందుకే..à°ˆ సంక్షోభం ప్రారంభమైన ఏడాదిలోపే పలు దేశాలు వడివడిగా టీకా కార్యక్రమాలు ప్రారంభించాయి. భారత్‌ కూడా à°ˆ ఏడాది జనవరిలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది. à°ˆ క్రమంలో ప్రభుత్వం ఎన్నో చిక్కుముడులను, సమస్యలను పరిష్కరించాల్సి వచ్చింది. టీకా లభ్యతను à°¦‌ృష్టిలో పెట్టుకుంటూ ప్రాధాన్య వర్గాలను గుర్తించడం, టీకా కేంద్రాల ఎంపికలో సహాయ పడటం, టీకా తీసుకున్న వారికి ధృవీకరణ పత్రాలు(సర్టిఫికేట్లు) ఇవ్వడం.. రెండో డోసు టీకా తేదిని గుర్తు చేస్తూ లబ్ధిదారులకు సందేశాలు పంపించడం.. ఇలా వ్యాక్సినేషన్‌కు సంబంధించి అన్ని కోణాలు, అంశాలను ప్రభుత్వం క్షుణ్ణంగా విశ్లేషించి.. ఐటీ సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించుకుంది.

 

à°ˆ క్రమంలో ఉనికిలోకి వచ్చిందే కొవిన్ పోర్టల్! ప్రజల అవసరాలు, సౌకర్యాలు దృష్టిలో పెట్టుకుని కేంద్రం దీన్ని రూపొందించింది. భారత్ వంటి అధిక జనాభా కలిగిన దేశంలో టీకాకరణ సులువుగా సాగిపోతోందంటే దాని వేనుక కొవిన్ పాత్ర ఎంతో ఉంది. అందుకే.. ప్రపంచంలోని అనేక దేశాల ప్రస్తుతం కొవిన్ పోర్టల్‌పై ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో భారత ప్రభుత్వం సోమవారం జరిగిన కొవిన్ గ్లోబల్ కాన్‌క్లేవ్‌లో కొవిన్‌ను అందరికీ అందుబాటులో తేస్తూ à°ˆ ఏపీఐ కోడ్‌ను ఓపెన్ సోర్స్‌à°—à°¾ చేసింది. à°ˆ నేపథ్యంలో కొవిన్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం..

 

కొవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌కు సంక్షిప్త రూపమే కొవిన్. జనవరిలో కరోనా టీకా కార్యక్రమం ప్రారంభించిన సమయంలోనే కేంద్రం కొవిన్ పోర్టల్‌ను ఆవిష్కరించింది. లబ్ధిదారులు టీకా కోసం తమకు నచ్చిన కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకునేందుకు à°ˆ పోర్టల్ అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం అమలవుతున్న తీరుతెన్నులను కూడా యూజర్లు కొవిన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక బ్యాక్ ఎండ్‌లో.. హెల్త్ కేర్ ప్రోవైడర్లు తమ వద్ద ఉన్న టీకా నిల్వలు, పంపిణీ జరిగిన డోసులకు సంబంధించిన వివరాలను కొవిన్‌ ద్వారా రియల్‌ టైం‌లో పరిశీలించవచ్చు.  

ఇంతకుముందు చెప్పుకున్నట్టు కొవిన్ ద్వారా ప్రజలు ఎక్కడి నుంచైనా టీకా కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. యాప్‌ లేదా వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్‌ను ఉపయోగించి ముందుగా à°ˆ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. à°† తరువాత వచ్చే ఓటీపీ సాయంతో లాగిన్ కావచ్చు. ఇక లబ్ధిదారులు తాము టీకా తీసుకున్న వెంటనే వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను అప్పటికప్పుడు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. à°ˆ టీకా ధృవీకరణ పత్రం ప్రపంచ వ్యాప్తంగా చెల్లుబాటవుతుంది. ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ పాస్‌పోర్టు వివరాలను టీకా సర్టిఫికేట్లకు జత చేయవచ్చు. విదేశీ ప్రయాణాలు పెట్టుకున్న వారికి ఇది ఎంతో ఉపయోగకరం.

 

భారత టీకా కార్యక్రమానికి వెన్నుముక అయిన కొవిన్ పోర్టల్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ 50à°•à°¿ పైగా దేశాల ప్రభుత్వాలు కొవిన్ విషయమై భారత్‌ను సంప్రదించాయి. కెనడా, మెక్సికో, నైజీరియా వంటి అనేక దేశాలు కొవిన్ సాంకేతికతను తమ టీకా కార్యక్రమంలో వినియోగించుకునేందుకు ఆసక్తి కనబరిచాయి. డిజిటల్ మౌలికసదుపాయాలు లేని దేశాలకు కొవిన్ ఎంతో ఉపయోగపడుతుందని మాల్దీవ్స్ వ్యాఖ్యానించింది. కొవిన్ టెక్నాలజీని ఉచితంగా ఇస్తూ ఉదారత చాటుకున్న భారత్‌కు ధన్యవాదాలు తెలిపింది. భారతకు భూటాన్ ప్రభుత్వం కూడా ధన్యవాదాలు తెలిపింది. టీకా పంపిణీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి విశ్లేషించడంలో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అయితే..దీనికి కొవిన్ చక్కటి పరిష్కారమని గయానా దేశం ఆరోగ్య శాఖ మంత్రి వ్యాఖ్యానించారు.