భారత్‌ను తాకనున్న థర్డ్‌వేవ్.

సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సం నుంచి యావత్ భారతదేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ థర్డ్ వేవ్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ భయంకరంగా ఉంటుందని కొందరంటే, దాని ప్రభావం అంతంత మాత్రమేనని మరికొందరు అంటున్నారు. ఈ విషయంలో నిపుణుల్లోనూ భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలలోనే థర్డ్ వేవ్ భారత్‌ను తాకుతుందంటూ భారతీయ స్టేట్ బ్యాంక్ పరిశోధన నివేదిక పేర్కొనడం ఆందోళన రేకెత్తిస్తోంది.
‘కొవిడ్-19: ది రేస్ టు ఫినిషింగ్ లైన్’ పేరుతో పబ్లిష్ అయిన ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక.. ఆగస్టులో థర్డ్ వేవ్ తాకుతుందని, సెప్టెంబరులో తీవ్రస్థాయికి చేరుతుందని పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్ మే 7న పతాకస్థాయికి చేరిందని గుర్తుచేసింది. ఏప్రిల్‌లో దేశాన్ని తాకిన సెకండ్ వేవ్ మేలో గరిష్ఠానికి చేరుకుందని తెలిపింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళతోపాటు ఇతర రాష్ట్రాల్లో వేలాది కుటుంబాలపై ప్రభావం చూపిందని వివరించింది.
ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే జులై రెండోవారం నాటికి దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య 10 వేలకు పడిపోతుందని, అయితే ఆగస్టు రెండో వారం నుంచి కేసుల సంఖ్య మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
దేశంలో నేడు 39,796 కరోనా కేసులు నమోదయ్యాయి. 42,352 మంది కోలుకోగా 723 మంది చనిపోయారు. తాజా కేసులతో కలుపుకుని దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల మొత్తం సంఖ్య 3,05,85,229కు చేరుకుంది. 4 లక్షల మందికిపైగా మరణించారు. దేశంలో ఇంకా 4.82 లక్షల కేసులు క్రియాశీలంగా ఉన్నాయి. అలాగే, ఇప్పటి వరకు 35 కోట్ల మందికి టీకాలు వేశారు. దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి, బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలపై దాని ప్రభావం వంటి అంశాలపై ఎస్‌బీఐ నిపుణుల బృందం ఎప్పటికప్పుడు అంచనా వేసి నివేదికలు రూపొందిస్తుంటూ ఉంటుంది

Share this on your social network: