ఎట్టకేలకు దిగొచ్చిన ట్విట్టర్

Published: Sunday July 11, 2021

ట్విటర్ ఎట్టకేలకు భారత ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడం ప్రారంభించింది. కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రూల్స్‌పై ప్రభుత్వం, ట్విటర్ మధ్య ప్రతిష్టంభన నెమ్మదిగా తొలగే అవకాశం కనిపిస్తోంది. à°ˆ నిబంధనలకు అనుగుణంగా భారత దేశంలో రెసిడెంట్ గ్రీవియెన్స్ ఆఫీసర్‌ను నియమించినట్లు ట్విటర్ ఆదివారం ప్రకటించింది. grievance-officer-in @ twitter.com ద్వారా భారత దేశంలోని యూజర్లు రెసిడెంట్ గ్రీవియెన్స్ ఆఫీసర్‌ వినయ్ ప్రకాశ్‌ను సంప్రదించవచ్చునని ట్విటర్ వెబ్‌సైట్‌లో పేర్కొంది. 

 
 
 
 
 
 
 
 

 

కొత్త ఐటీ రూల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. చీఫ్ కాంప్లియెన్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్, గ్రీవియెన్స్ ఆఫీసర్‌లను నియమించాలని తెలిపింది. యూజర్ల సంఖ్య 5 మిలియన్ల కన్నా ఎక్కువ ఉన్న సామాజిక మాధ్యమాల సంస్థలు à°ˆ ముగ్గురు అధికారులను తప్పనిసరిగా నియమించాలని తెలిపింది. à°ˆ అధికారులు భారత దేశంలోనే నివసించాలని పేర్కొంది. 

 

రెసిడెంట్ గ్రీవియెన్స్ ఆఫీసర్‌à°—à°¾ వినయ్ ప్రకాశ్‌ను నియమించినట్లు ట్విటర్ తెలిపింది. భారత దేశంలో ట్విటర్‌ను సంప్రదించవలసిన చిరునామాను కూడా తెలిపింది. నాలుగో అంతస్థు, ది ఎస్టేట్, 121 డికెన్సన్ రోడ్, బెంగళూరు. పిన్ : 560042లో వినయ్ ప్రకాశ్‌ను సంప్రదించవచ్చునని పేర్కొంది. 

 

2021 మే 26 నుంచి జూన్ 25 వరకు కాంప్లియెన్స్ రిపోర్టును కూడా ట్విటర్ ప్రచురించింది. కొత్త ఐటీ రూల్స్ ప్రకారం à°ˆ నివేదికను ప్రచురించడం కూడా తప్పనిసరి. ట్విటర్ అంతకుముందు ధర్మేంద్ర చతుర్‌ను తాత్కాలిక రెసిడెంట్ గ్రీవియెన్స్ ఆఫీసర్‌à°—à°¾ నియమించింది. అయితే ధర్మేంద్ర à°—à°¤ నెలలో à°† పదవి నుంచి వైదొలగారు.