‘మైనింగ్‌’పై సూటిగా లేని సర్కారు సమాధానాలు

Published: Sunday July 11, 2021

విశాఖలో వివాదంగా మారిన మైనింగ్‌ అనుమతుల విషయంలో జరిగిందొకటి...బయటకు చెబుతున్నదొకటిగా ఉంటోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. గనుల అధికారుల వ్యవహారశైలి à°ˆ అనుమానాలను మరింత పెంచేస్తోంది. 2018లోనే నాతవరం మండలం భమిడికలొద్ది పంచాయతీలో 121 హెక్టార్ల భూమిలో లేటరైట్‌ మైనింగ్‌ ఇచ్చామని నిన్నటిదాకా చెప్పిన ప్రభుత్వం...ఇప్పుడు అసలు పత్రాలు బయటకొచ్చేసరికి  మాటమార్చేసింది. à°ˆ ఏడాది ఫిబ్రవరిలోనే మైనింగ్‌ లీజు ఇచ్చామని వెల్లడించింది. మరి 2018లోనే లీజు ఇచ్చామని చెబుతూ వచ్చారు కదా అంటే...2018, 2109, 2021à°•à°¿ ఏమిటీ తేడా అంటూ కొత్త వాదన తెరమీదకు తీసుకొచ్చింది. ఇప్పుడు చెప్పాం కదా... డాక్యుమెంట్లను బహిరంగంగానే ఉంచుతాం...కోర్టు ఆర్డర్‌ ఉందంటూ గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కొత్త విషయాన్ని చెప్పారు. విశాఖ మైనింగ్‌ ఏరియాలో తెలుగుదేశం పార్టీ, ప్రజాసంఘాలు శుక్రవారం పర్యటించి వచ్చాయి. సర్కారుతీరుపై , ప్రత్యేకించి అధికారుల శైలిపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. దరిమిలా శనివారం సాయంత్రం నాలుగు గంటలకు గనుల కార్పొరేషన్‌ à°Žà°‚à°¡à±€ కార్యాలయంలో ద్వివేది విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పలు అంశాలపై మాట్లాడారు. ఈసందర్భంగా విలేకరులు à°…à°¡à°¿à°—à°¿à°¨ కొన్ని ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానాలు చెప్పలేదు. కీలకమైన అంశాలపై దాటవేశారు. కోర్టు ఆర్డర్‌ ఉందని పదేపదే వల్లిస్తూ కీలకమైన అంశాలకు డొంకతిరుగుడు సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడేమీ జరగలేదు...అన్నీ గతంలోనే జరిగాయి..కావాలంటే డాక్యుమెంట్లు చూడండి...అవే వాస్తవాలను మాట్లాడతాయని చెప్పేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నించారు. కానీ అప్పటి డాక్యుమెంట్లను ప్రస్తావిస్తూ మరి ఇవేమిటి అంటే....కోర్డు ఆర్డర్‌ను చూపిస్తూ మళ్లీ దాటవేతలకే ప్రయత్నించారు.