చైనాలో మరో కొత్త వైరస్.

Published: Monday July 19, 2021

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన మరో కొత్త వైరస్ చైనాలో బయటపడింది. ‘మంకీ బీ’à°—à°¾ పిలిచే à°ˆ కొత్త వైరస్‌తో చైనాలో à°“ శాస్త్రవేత్త మరణించడం కలకలం రేపుతోంది. కోతులపై పరిశోధనలు చేసే పశువైద్య నిపుణులు ఒకరు మంకీ బీ బారిన పడి మరణించారు. మంకీ బీ వైరస్ బయటపడేందుకు 1 నుంచి 3 వారాల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మంకీ బీ వైరస్ సోకితే ప్రధానంగా నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని గుర్తించారు. వైరస్ సోకితే 70 నుంచి 80 శాతం మంది మరణించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. à°ˆ వైరస్ సోకిన వారికి జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, విపరీతమైన అలసట వచ్చే ప్రమాదం ఉంది.