DRDO ప్రయోగం సక్సెస్

Published: Wednesday July 21, 2021

ఆత్మనిర్భర్ భారత్‌ సాధించే దిశగా భారత రక్షణ à°°à°‚à°— పరిశోధన సంస్థ(డీఆర్‌డీఓ) మరో ముందడుగు వేసింది. శత్రుదేశ యుద్ధ ట్యాంకులను తుత్తునియలు చేసే ఎమ్‌పీఏటీజీఎమ్(మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్) క్షిపణిని బుధవారం  విజయవంతంగా ప్రయోగించింది. మ్యాన్ పోర్టబుల్ లాంచర్ ద్వారా ప్రయోగించిన à°ˆ క్షిపణి నిర్దిష్ట లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్‌డీఓ వర్గాలు తెలిపాయి. సమీపంలోని లక్ష్యాలను క్షిపణి కచ్చితంగా ఛేదించగలదని à°ˆ ప్రయోగంలో రుజువైందని పేర్కొన్నాయి. ఇక సుదూర టార్గెట్లకు సంబంధించి గతంలో జరిగిన పరీక్షలు విజయవంతమైన విషయం తెలిసిందే. à°ˆ మిస్సైల్‌లో అత్యాధునిక ఇన్‌ఫ్రా రెడ్ సీకర్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ఉన్నాయని డీఆర్‌డీఓ పేర్కొంది.