వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
Published: Wednesday July 21, 2021

ఎల్లుండి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి 40-50 కి.మీ. వేగంతో బలమైన గాలులు ఈచే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Share this on your social network: