Tokyo Olympics 2020: ప్రారంభమైన ఒలింపిక్స్
Published: Friday July 23, 2021

విశ్వక్రీడా సంరంభమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. నిజానికి గతేడాది జరగాల్సిన ఈ క్రీడల కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు నేడు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అత్యంత సాదాసీదాగా 1000 మంది అతిథుల సమక్షంలో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30కు మొదలయ్యాయి. జపాన్ చక్రవర్తి నరహిటో క్రీడలను ప్రారంభించారు. ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందాన్ని హాకీ పురుషుల జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, మహిళా బాక్సర్ మేరీకోమ్ త్రివర్ణ పతకాన్ని చేబూని నడిపించారు.
ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు జపాన్ పతాకం స్టేడియంలోకి ప్రవేశించింది. చారిత్రక నేపథ్యం కలిగిన గ్రీస్ బృందంతో పరేడ్ మొదలైంది. ఐవోసీ శరణార్థి ఒలింపిక్ జట్టును స్టేడియంలోకి ఆహ్వానించారు. ఈ జట్టుకు ఆహ్వానం పలకడం ఒలింపిక్ చరిత్రలో ఇది రెండోసారి.
1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ సందర్భంగా పాలస్తీనియన్ గన్‌మెన్ చేతిలో హత్యకు గురైన ఇజ్రాయెల్ ఒలింపిక్ జట్టును ఈ సందర్భంగా గుర్తు చేసు

Share this on your social network: