పాఠశాలల ప్రారంభం సమంజసం కాదు

Published: Friday July 23, 2021

కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో పాఠశాలల ప్రారంభం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ఏబీఎన్ తో ఆయన మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్.. పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలను పునఃప్రారంభించాలనుకోవడం పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ.. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని విమర్శించారు. పాఠశాలల ప్రారంభంపై తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు.