రెజ్లింగ్‌లో ప్రియా మలిక్‌‌కు స్వర్ణం

Published: Sunday July 25, 2021

 కేడెట్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత జూనియర్ రెజ్లర్ ప్రియా మలిక్ బంగారు పతకం కైవసం చేసుకుంది. హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న పోటీల్లో మలిక్ 73 కేజీల కేటగిరీలో ఆదివారం స్వర్ణం కొల్లగొట్టింది. బెలారస్‌కు చెందిన సేనియా పటపోవిచ్‌తో జరిగిన పోరులో 5-0 విజయం సాధించి పసిడి పతకాన్ని మెడలో వేసుకుంది. టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజత పతకం సాధించిన మరునాడే ప్రియా మలిక్ స్వర్ణం కొల్లగొట్టడం గమనార్హం.

ప్రియ గెలపుతో సోషల్ మీడియా శుభాకాంక్షలతో హోరెత్తిపోతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత చౌతాలా ఆమెను అభినందించారు. పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేస్తూ.. ప్రియా మలిక్ దేశానికి గర్వకారణంగా నిలిచిందన్నారు.