ధోలావీరాకు యునెస్కో గుర్తింపు

Published: Tuesday July 27, 2021

గుజరాత్‌లోని ధోలావీరాను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో హెరిటేజ్ కమిటీ గుర్తించింది. చైనా నుంచి ఆన్‌లైన్‌లో జరుగుతున్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 44వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ధోలావీరా హరప్పా నాగరికత కాలంనాటిది. సామాన్య శకానికి పూర్వం (బీసీ) 1800లో దీనిని నిర్మించినట్లు తెలుస్తోంది.

ప్రకృతి సంబంధమైన, సాంస్కృతిక ప్రాధాన్యంగల ప్రదేశాలను ఈ విధంగా ప్రపంచ వారసత్వ సంపదలుగా గుర్తిస్తారు. ప్రస్తుత, భావి తరాలకు ఉమ్మడి ప్రాధాన్యంగలవాటికి ఈ గుర్తింపు లభిస్తుంది.