లవ్లీనా అరంగేట్రం అదుర్స్!

Published: Tuesday July 27, 2021

టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్‌ అదరగొట్టింది. మహిళల 69 కిలోల బాక్సింగ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లో జర్మనీకి చెందిన నాదినె ఎపెట్జ్‌పై 3-2తేడాతో విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. తదుపరి మ్యాచ్‌లో గెలిస్తే లవ్లీనాకు పతకం ఖాయం. లవ్లీనా పతకానికి అడుగు దూరంలో ఉంది. తొలి మ్యాచ్‌లో బై లభించడంతో లవ్లీనా నేరుగా ప్రిక్వార్టర్‌కు దూసుకొచ్చింది. ఈ మ్యాచ్‌లో 12 ఏళ్ల అనుభవం ఉన్న ప్రత్యర్థి నాదినెపై లవ్లీనా చాలా తెలివిగా ఆడి విజయం సాధించింది. దీంతో ఒలింపిక్స్ అరంగేట్రంలోనే లవ్లీనా అదరగొట్టింది. ఇక్కడ యాధృచ్చికం ఏంటంటే.. వీరిద్దరికీ ఇదే తొలి ఒలింపిక్స్‌.