కేంద్రం బంపర్ ఆఫర్!

Published: Wednesday July 28, 2021

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా దేశ ప్రజల కోసం à°“ కొత్త పోటీని ప్రకటించింది. దేశంలో మౌలికవసతుల అభివృద్ధికి ఏర్పాటు చేయబోతున్న డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌కు(డీఎఫ్ఐ) పేరు, లోగో, ట్యాగ్‌లైన్ సూచించిన వారికి గరిష్ఠంగా రూ.15 లక్షల బహుమతి ఇస్తామని పేర్కొంది. à°ˆ పోటీలో పాల్గొనదలిచిన వారు ఆగస్టు 15 సాయంత్రం 5.30 లోపు తమ ఎంట్రీలను కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. ఒక్కో కేటగిరికి రూ. 5 లక్షల బహుమతిని ఆర్థిక శాఖ ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలకు తగినట్టు డీఎఫ్ఐ పేరు, లోగో, ట్యాగ్‌లైన్‌ను ఒకే వ్యక్తి సూచించగలిగితే ఏకంగా రూ.15 లక్షల బహుమతిని గెలుచుకోవచ్చు. అంతేకాకుండా.. రెండో, మూడో బహుమతి పొందిన వారు రూ.3 లక్షలు, రూ.2 లక్షలు చొప్పున ప్రైజ్ మనీని పొందవచ్చు. కేంద్రం సూచనల ప్రకారం.. డీఎఫ్ఐ ఏర్పాటు వెనకున్న ఉద్దేశ్యాన్ని పేరు, లోగో, ట్యాగ్‌లైన్ ప్రతిఫలించాల్సి ఉంటుంది. సంస్థ లక్ష్యాలు ప్రజల మనసుల్లో నాటుకునేలా వీటిని డిజైన్ చేయాలి. సంస్థ పేరు పలికేందుకు సులువుగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా రూపకల్పన చేయాల్సి ఉంటుంది. https://www.mygov.in/task/name-tagline-and-logo-contest-development-financial-institution à°²à°¿à°‚క్ ద్వారా ప్రజలు తమ ఎంట్రీలను పంపించవచ్చు.