ఏపీలో కొత్తగా 2,010 కొవిడ్ కేసులు

Published: Wednesday July 28, 2021

ఏపీలో కొత్తగా 2,010 కొవిడ్ కేసులు నమోదు కాగా, కరోనాతో 19 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 19,59,942 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కరోనాతో 13,312 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 20,999 యాక్టివ్‌ కేసులు ఉండగా, 19,25,631 మంది రికవరీ అయ్యారు. గత 24 గంటల్లో 1,956 మంది రికవరీ కాగా, 70,695 శాంపిల్స్ ను స్వీకరించారు. కృష్ణా జిల్లాలో నలుగురు, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. గుంటూరు, కడప, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు