కొవిడ్ ఆంక్షలను సరళతరం చేస్తున్నయూకే

Published: Thursday August 05, 2021

 భారత ప్రయాణికులకు యూకే గుడ్ న్యూస్ చెప్పింది. కొవిడ్ ఆంక్షలను సరళతరం చేస్తున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సెకెండ్ వేవ్ రూంలో కరోనా మహమ్మారి భారత్‌లో విజృంభించిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని ప్రపంచ దేశాలు భారత ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. యూకే సైతం ఇండియాను రెడ్‌లిస్ట్‌లో చేర్చింది. ప్రస్తుతం ఇండియాలో పరిస్థితులు కాస్త మెరుగుపడినందున రెడ్‌లిస్ట్ నుంచి తొలగించి, అంబర్ లిస్ట్‌లో చేర్చింది. ఈ క్రమంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను పూర్తి స్థాయిలో తీసుకున్న భారత ప్రయాణికులు బ్రిటన్‌లో 10 రోజులపాటు తప్పనిసరిగా హోటల్ క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది. 

హోం క్వారెంటైన్‌లో ఉంటే సరిపోతుందని వెల్లడించింది. ఐదు రోజులపాటు హోం క్వారెంటైన్‌లో ఉన్న తర్వాత ‘టెస్ట్ టు రిలీజ్’ స్కీమ్ కింద సొంత ఖర్చులతో కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని పేర్కొంది. అందులో నెగెటివ్ వస్తే క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఉండదని చెప్పింది. ప్రయాణానికి 72 గంటల ముందు తప్పనిసరిగా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది. అంతేకాకుండా బ్రిటన్‌కు చేరిన తర్వాత కరోనా టెస్ట్‌లు చేయించుకోవడానికి ముందుగానే స్లాట్‌లను బుక్ చేసుకోవాలని తెలిపింది. సవరించిన ఈ ఆంక్షలు ఆగస్ట్ 8 నుంచి అమలులోకి వస్తాయని బ్రిటన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా విజిట్, దీర్ఘకాలిక వీసాల జారీ ప్రక్రియ కూడా కొనసాగుతోందని బ్రిటన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.