సర్కారుకు కొత్త అప్పులు ఇచ్చేందుకు వెనక్కి తగ్గుతున్న బ్యాంకర్లు

Published: Thursday August 05, 2021

స్వయంగా సర్కారువారే అప్పు అడుగుతుంటే... ఇస్తే తప్పేముందని అనుకున్నారు కొందరు!

మద్యం ఆదాయమో, మరొకటో ‘హామీ’à°—à°¾ చూపించారు కదా... ఇస్తే పోయేదేముందని అనుకున్నారు మరికొందరు! 

టార్గెట్లు పూర్తి చేసుకోవడానికో, ఇంకెందుకో ఎడాపెడా లోన్లు ఇచ్చేశారు ఇంకొందరు! 

ఇప్పుడు... à°ˆ బ్యాంకర్లలో గుబులు పట్టుకుంది. ‘మీ అప్పులు తప్పు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ చెల్లదు. అది రాజ్యాంగ అధికరణలకు విరుద్ధం’ అని స్వయంగా కేంద్రమే స్పష్టం చేయడంతో ఏపీకి అప్పులు ఇచ్చిన బ్యాంకర్లు బెంబేలెత్తుతున్నారు. à°ˆ వ్యవహారం ఎటుపోయి ఎటు చుట్టుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు.. కొత్తగా అప్పులు ఇచ్చేందుకూ వెనక్కితగ్గుతున్నారు. నిబంధనలు పాటించకుండా ఏపీ సర్కారుకు బ్యాంకులు అప్పులు ఇచ్చిన వైనంపై విచారణ జరపాలని విపక్షాలు కూడా డిమాండ్‌ చేస్తున్నాయి. అప్పుల కోసం ఏపీ సర్కారు ‘రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌’ (ఎస్‌డీసీ) ఏర్పాటు చేసింది. ప్రభుత్వ స్థలాలు, మద్యంపై అదనపు పన్ను ద్వారా విధించే ఆదాయాన్ని హామీగా చూపించి రూ.25,000 కోట్లు అప్పు తేవాలన్నది లక్ష్యం. దేశంలోనే అగ్రగామి బ్యాంకు ఎస్‌బీఐ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ క్యాప్స్‌ వివిధ బ్యాంకుల (కన్సార్షియం) ద్వారా à°ˆ అప్పులు ఇప్పిస్తోంది. ఇందులో రూ.21,500 కోట్లు ఇప్పటికే తీసుకున్నారు.

 

ఇంకా బ్యాంకుల నుంచి రూ.3,500 కోట్లు రావాలి. భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తేవడం చెల్లదని...  ఎస్‌డీసీ ఏర్పాటే రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం తెలిపింది. ‘తప్పు’ చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. à°ˆ నేపథ్యంలో సర్కారుకు కొత్త అప్పులు ఇచ్చేందుకు బ్యాంకర్లు వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం. అప్పులకు కేంద్రం ఇచ్చిన ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి జూలై 13à°µ తేదీనే ముగిసిపోయింది. అయినప్పటికీ ఇంకా తమకు రూ.3,000 కోట్లకు అనుమతి ఉందంటూ రాష్ట్రం ఆర్‌బీఐకి సమాచారం ఇచ్చి à°† మేరకు అప్పులు తేవాలని ప్రయత్నిస్తోంది.

రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ విషయంలో కేంద్రం తీసుకునే నిర్ణయంపై అన్ని రాష్ట్రాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. చూసీచూడనట్టు వదిలేస్తే దొడ్డిదారిన అప్పులు తెచ్చుకోవడంలో మిగిలిన రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శం అవుతుంది. కానీ ఏపీ ఆర్థిక అక్రమాలను సమర్థిస్తే తర్వాత మిగిలిన రాష్ట్రాలూ ఇదే బాటలో వెళ్లే ప్రమాదముందని... అప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి à°ˆ అంశంలో కేంద్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందని మాజీ అధికారులు చెబుతున్నారు. à°ˆ ఆర్థిక సంవత్సరంలో ఇంకా రాష్ట్రానికి రూ.7,000 కోట్లు మాత్రమే అప్పు చేసే అవకాశం ఉంది. అది కూడా కేంద్రం అనుమతిస్తేనే! à°ˆ రూ.7000 కోట్లు రాష్ట్రానికి ఒక్క నెలకు మాత్రమే సరిపోతాయి. అందుకే ఇంకా రూ.40,000 కోట్లకు అనుమతివ్వాలని కోరుతూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ à°—à°¤ వారం ఢిల్లీలో కేంద్ర అధికారుల చుట్టూ తిరిగారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని మించి ఖర్చు చేసిన రూ.18,000 కోట్ల కోతను విడతలవారీగా విధించాలని... అదికూడా 2024 తర్వాత నుంచి అమలు చేయాలని విన్నవించుకున్నారు.

 

ఇప్పటివరకు à°† విజ్ఞప్తులపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించకపోగా.. ఎస్‌డీసీ అప్పుల లెక్కలు చెప్పాలంటూ లేఖ రాయడం గమనార్హం. బడ్జెట్‌ పుస్తకాల్లో రాయకుండా దాచిన రూ.21,500 కోట్ల అప్పు బయటపడిన నేపథ్యంలో.. à°† మొత్తాన్ని కూడా రూ.18,000 కోట్ల తరహాలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి నుంచి కోత విధిస్తుందా అనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే.. à°ˆ ఏడాది కొత్త  అప్పులకు అనుమతి దొరకదు. à°† ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరమూ ఉంటుంది. కేంద్రం రాసిన లేఖపై వివరణ ఇచ్చేందుకు రావత్‌ మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు.

కేంద్ర ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి తెలియకుండా à°’à°• రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులివ్వడం రాజ్యాంగ విరుద్ధమని బ్యాంకర్లకు తెలియని విషయం కాదని నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ... టార్గెట్లు సాధించడానికి దొడ్డిదారిలో రాష్ట్రాలకు అప్పులిచ్చేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కాంట్రాక్టర్లు/సరఫరాదారులు బిల్లుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నట్లే... భవిష్యత్తులో అప్పుల వసూలు కోసం బ్యాంకులూ కోర్టులను ఆశ్రయించక తప్పదని నిపుణులు అంటున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటి రూ.లక్ష కోట్లకు పైగా అప్పులు తెచ్చి కేంద్రానికి తెలియకుండా దాచారు. ఇప్పుడు రూ.21,500 కోట్ల అప్పు సంగతి దాచలేమని అధికారులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక సాక్ష్యాలతో దొరికిపోయాక దాచి ప్రయోజనం లేదని భావిస్తున్నారు. à°ˆ నేపథ్యంలో ‘అవును. అప్పు చేశాం’ అని ఒప్పుకొంటూ కేంద్రానికి లేఖ రాస్తే.. తదుపరి అప్పులకు అనుమతి వస్తుందో లేదోనన్న ఆందోళన ప్రభుత్వంలో కనిపిస్తోంది. విచారణకు, కేంద్రం లేఖకు భయపడి బ్యాంకులు తప్పుకొన్న తక్షణం.. రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని చెబుతున్నారు.