పోలవరంలో మరో కీలక నిర్మాణానికి అంకురార్పణ

Published: Friday August 06, 2021

పోలవరం ప్రాజెక్టులో మరో కీలక నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి అవసరమైన ప్రీజర్వ్ టన్నెల్స్ తవ్వకాలను  మేఘా సంస్థ ప్రారంభించింది. à°ˆ ప్రాజెక్టులో భాగంగా 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని చేపట్టారు. à°ˆ పనులను మేఘా సంస్థకు à°ˆ ఏడాది మార్చి నెలలో రివర్స్ టెండరింగ్ విధానంలో అప్పగించారు. దీనికి సంబంధించి ఇప్పటికే 18 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనిచేసారు. కాగా టన్నెల్ ప్రీజర్వ్ పనులు, ఇతర పనులను జన్‌కో, తవ్వకం పనులను జలవనరుల శాఖ పర్యవేక్షణలో సాగుతున్నాయి. à°ˆ రోజు జరిగిన కార్యక్రమంలో జన్‌కో, జలవనరుల శాఖల అధికారులు, మేఘ ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.