బజరంగ్‌ పునియాకు కాంస్యం

Published: Saturday August 07, 2021

 ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం సొంతమైంది. 65 కేజీల పురుషుల ఫ్రీస్టైల్‌లో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత రెజ్లర్ బజరంగ్ పునియా కాంస్య పతకంతో మెరిశాడు. కజక్‌స్థాన్‌కు చెందిన దౌలత్ నియాజ్‌బెకోవ్‌తో జరిగిన పోరులో తిరుగులేని ప్రదర్శనతో మట్టికరిపించాడు. ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా 8-0తో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు. ఈ విజయంతో ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 6కు చేరుకుంది. కాగా, నిన్న జరిగిన సెమీస్‌లో అజర్‌బైజన్‌కు చెందిన అలియేవ్ చేతిలో బజరంగ్ 5-12తో ఓటమి పాలయ్యాడు.